yadagiri gutta sri lakshmi narasimha swamy
-
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
చిన్న వానే.. యాదాద్రి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ మండపాల స్లాబ్‌పై నీళ్లు నిలిచాయి. దీంతో అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖమండపంలోని అండాళ్ అమ్మవారి ఆలయం వెనుకున్న గోడ, ఆంజనేయస్వామి ఆలయం వెనక భాగాల్లోని గోడ నుంచి వర్షపు నీరు కారుతోంది. గతంలో వర్షం కురిసిన సమయాల్లో లీకేజీలు ఏర్పడ్డ చోట మరమ్మతులు చేపట్టినా లీకేజీలు అవుతున్నాయి. ఇక మాడ వీధుల్లో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచింది. క్యూకాంప్లెక్స్ మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు చుక్కలుగా పడుతున్నాయి. కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న మట్టి రోడ్డు సైతం కోతకు గురైంది. ఇది కూడా చదవండి: కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే? -
కార్తీక మాసం షురూ.. యాదాద్రిలో భక్తుల సందడి (ఫోటోలు)
-
‘అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం పాపం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేటీఆర్ మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల ముందకు అన్ని విషయాలు వచ్చాయి. దొంగ ఎవరో.. దొర ఎవరో తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేయడం పాపం. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నాను. ప్రమాణాలు చేసుకుంటూ పోతే చట్టాలు, కోర్టుల అవసరం ఏముంది. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా నేను మాట్లాడను. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం చేస్తున్న సందర్భంగా బండి సంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ, తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
యాదాద్రికి ‘బంగారు’ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం హెటిరో సంస్థ చైర్మన్ పార్థసారథిరెడ్డి తన కుటుంబం తరఫున 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అలాగే, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. టీఆర్ఎస్కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, ఎం.హన్మంతరావు, ఎం.కృష్ణారావు, కేపీ వివేకానంద్ తమ కుటుంబాల తరఫున ఏడు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఏపీ నుంచి జడ్పీటీసీ.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విమాన గోపుర స్వర్ణ తాపడం పనుల కోసం కిలో బంగారాన్ని విరాళంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని పేర్కొంది. ’ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని జయమ్మ పేర్కొన్నట్టు సీఎంఓ తెలిపింది. -
యాదాద్రి: అడుగడుగు.. అణువణువు
సాక్షి, యాదాద్రి: యాదగిరి క్షేత్రాన్ని పునఃప్రారం భించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళ వారం యాదాద్రిలో పర్యటించారు.సుమారు 8 గం టల పాటు ఆయన ప్రధానాలయంతో పాటు యాదాద్రిలో చేపట్టిన పనులను పరిశీలించి సూచ నలు చేశారు. పూర్తికావచ్చిన ఆలయ పునర్ని ర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని పరిశీలిం చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు, పరిసరాలన్నిం టినీ పరిశీలించారు. మధ్యాహ్నం 12.40గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగి కొండపై బాలాలయానికి చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సీఎంకు పుష్పగుచ్చాలు అందజేయగా వేదపండితులు, అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. బాలాలయంలో అర్చన అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం.. పెంబర్తి కళాకారులు తీర్చిదిద్దిన ప్రధానాలయ ద్వారాలను పరిశీలించారు. ప్రాంగ ణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను తన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృ«శ్యాలను పరిశీలించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తది తర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొం దించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాల యం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అర్చకులకు ఇళ్ల స్థలాలు ఆలయ అర్చకులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరగా.. నిర్ణయం ఎప్పుడో తీసుకున్నం దున ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అర్చ కులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటా యించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. ‘మీకు పీఆర్సీ వస్తోందా ?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగు లను అడిగి తెలుసుకున్నారు. రింగురోడ్డు నిర్మాణ సమయంలో వాణిజ్య స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కల్యాణ కట్ట సమీపంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. త్రిదండి చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ఆలయ ప్రారం భం ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని కోరుతూ ఆలయ ఈఓ గీతకు సీఎం కేసీఆర్ అందించారు. యాదాద్రిలోని రామలింగేశ్వ రాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు, ఎమ్మె ల్యేలు, తదితరులతో కలిసి భోజనం చేశారు. కొండ కింద పనుల పరిశీలన సాయంత్రం.. కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్క రిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణా లను పరిశీలించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిం చారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతు న్నట్లు చెప్పారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీ లను నిర్మిస్తుందని తెలిపారు. మద్యపానం నిషేధం యాదాద్రి పవిత్రతను కాపాడ టానికి అందరూ సహకరించా లని, టెంపుల్ సిటీ పరిధిలో మద్య పానం, ధూమపానం నిషేధాన్ని కఠినతరంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం శాకాహారాన్నే అను మతించాలని సూచించారు. వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్లు యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐ పీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసి డెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు. హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగ వత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవ దాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు హెలీపాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తా, సీఎం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. ప్రతి శిల్పం ప్రత్యేకంగా పరిశీలన ఆలయం ముందున్న వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం ప్రధాన దేవాలయ గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్రనామాలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్ర పటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రి వర్గ సహ చరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలిం చారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్లు, క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు. -
యాదాద్రి: 2022 మార్చి 28 నుంచి దివ్యదర్శనం
మహా ఉత్కృష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శించుకున్నా. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశాం. తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుంది. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించాం. –కేసీఆర్ సాక్షి, యాదాద్రి: మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు. అంతకంటే ముందు మార్చి 21వ తేదీన మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందని చెప్పారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభ కార్యక్రమం మొత్తం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం రాత్రి యాదాద్రి కొండపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ పునః ప్రారంభం ఘనంగా జరుగుతుందని ప్రకటించారు. తిరుమల మాదిరిగానే మన రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రారంభం మన చేతుల్లో ఉండదని, ఆగమ, వాస్తు వంటి పలు శాస్త్రోక్త పద్ధతులలో చేయాల్సి ఉంటుందని చెప్పారు. 50 ఏళ్ల కిందట దర్శించుకున్నా.. గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన మన తెలంగాణ ఆధ్యాత్మిక రంగంలోని పరిమళాలను నూతన చరిత్రకారులు వెలికితీస్తున్నారని అన్నారు. మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని తాను 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశామని చెప్పారు. విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం ఖరారు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమ ముహూర్తాన్ని జీయర్ గారి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో నిర్ణయించడం జరిగిందని, మహా సుదర్శన యాగంతో ఇది ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సహస్రాశ్ట (1008) కుండలతో దీనిని నిర్వహించడం జరుగుతుందని, 6 వేల మంది ఋత్విక్కులు, 3 వేల మంది సహాయకులు పాల్గొంటారని చెప్పారు. జీయర్‌స్వామి పీఠంలో శ్రీమద్రమానుజ 1004వ జయంతి సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహిస్తున్నారని, అక్కడ యాగం పూర్తి కాగానే యాదాద్రిలో యాగం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఉద్ఘాటనకు దేశ, విదేశాలకు చెందిన పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ దీవించాలని కోరారు. మహా సుదర్శన యాగ కార్యానికి లక్షా యాభై వేల కిలోల కల్తీ లేని నెయ్యి వినియోగిస్తున్నట్లు తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, పనులను రేపటి నుంచి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, మోత్కుపల్లి స్వర్ణతాపడంలో ప్రజలందరికీ భాగస్వామ్యం స్వామివారి గర్భగుడి దివ్య విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుందన్నారు. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. గౌరవ ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు, 3,600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరినీ భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. రూ.11 నుంచి ఎంత వీలైతే అంత చెల్లించాలని కోరారు. మొట్ట మొదటగా తమ కుటుంబం నుంచి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇలా పలువురు బంగారం విరాళంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుంచి పదకొండు రూపాయల చొప్పున ఇచ్చినా సంతోషమేనని అన్నారు. ఈ ఆలయం మనది అనే భావనతో అందరూ స్వామివారి కార్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కాటేజీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించే విధంగా వెయ్యి సూట్లతో 250 కాటేజీల నిర్మాణం వెంటనే చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి వెళ్లిన భక్తులు నాలుగైదు రోజులు అక్కడే ఎలా ఉంటారో యాదాద్రిలో కూడా అలాగే ఉండాలన్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి పనులు వేగంగా పూర్తి చేస్తామని, రూ.6.90 కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉచిత బస్సు కోసం బస్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ జలమండలి సహాయంతో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్లేలా) పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని, చక్కని కాలనీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. జర్నలిస్టులు దేవాలయ మార్పు చూసినవారు కాబట్టి ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని సీఎం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 60 లక్షల ఎకరాలలో పంట రాబోతోందని చెప్పారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు, కులం జాతి అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నవంబర్ 4వ తేదీ తర్వాత దళిత బంధు పథకం ద్వారా దళిత బిడ్డల ఆర్థిక ఉన్నతికి పది లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. యాదాద్రిపై యాదర్షి ఋషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు కూడా జరుగుతుందన్నారు. అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప ఆకర్షణీయమైన కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరంలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ రూపుదిద్దుకుందని, మల్లన్న సాగర్ నుంచి ప్రతిరోజూ స్వచ్ఛమైన గోదావరి జలాలు లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలను తాకడం మన అదృష్టమని పేర్కొన్నారు. దీనితో ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇది స్వామి వారి దీవెన అని కొనియాడారు. తెలంగాణ బిడ్డ, రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు మన శిల్పారామం సృష్టికర్త అని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం చక్కగా అవిష్కృతం అవుతోందన్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నర్సింహాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఫొటోలు -
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
-
కల్యాణం.. వైభోగం
సాక్షి, యాదాద్రి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం శుక్రవారం యాదాద్రిలో అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం కల్యాణతంతు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన గల బాలాలయంలో ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. విశ్వక్సేన, ఆరాధన పూజలు నిర్వహించిన అనంతరం స్వస్తివాచనం చేసి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. 12.16 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి దంపతులను ఒకచోటుకు చేర్చారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. స్వామివారు కల్యాణోత్సవం సందర్భంగా గజవాహనంపై వచ్చి భక్తులను అనుగ్రహించారు. కల్యాణోత్సవంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ సదారాం, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయిని నరసింహమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఆలయ ఉద్యోగులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాత్రి కొండకింద ఉన్న పాత జెడ్పీ హైస్కూల్లో భక్తుల కోసం వైభవోత్సవ కల్యాణం జరిగింది. ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న గవర్నర్ దంపతులు -
విలీనం.. రచ్చ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్ట దేవస్థానం విలీనం వివాదం ముదురుతోంది. తమ దేవస్థానాన్ని ప్రధాన దేవస్థానంలో విలీనం చేయాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్న పాతగుట్ట సిబ్బంది కోరికను కోర్టు అంగీకరించి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరిగింది. మొదటి నుంచీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గుట్ట ఉద్యోగులు తీర్పుపై స్టే తెచ్చారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. పాతగుట్ట సిబ్బంది ఆందోళనకు దిగడం.. భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవడంతో గొడవ మరింత తారస్థాయికి చేరింది. భువనగిరి/యాదగిరికొండ, న్యూస్‌లైన్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధాన దేవస్థానంతోపాటు పాతగుట్ట దేవస్థానం ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాలకు ఉద్యోగులు, సిబ్బంది వేర్వేరుగా ఉన్నారు. రెండింటికి ఈఓ ఒక్కరే ఉన్నప్పటికీ ఎక్కడి ఆదాయం అక్కడే. ఎక్కడివారు విధులు అక్కడే నిర్వహించాలి. చాలాకాలంగా పాతగుట్ట ఆలయాన్ని యాదగిరిగుట్ట ప్రధాన దేవస్థానంలో కలపాలని ఆక్కడి ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని గుట్ట ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. విలీనం చేస్తే సీనియారిటీ, బెనిఫిట్స్ విషయంలో అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇరుదేవస్థానాల సిబ్బంది మధ్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి 2014 వరకు... 1989లో పాతగుట్ట ఆలయాన్ని 6బీ ఆలయాల నుంచి 6ఏ ఆలయాలలోకి (ప్రధాన దేవస్థానంలోకి) మార్చారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సైతం నివేదిక పంపించింది. దీనికి 1990లో ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలో 1991లో పాతగుట్ట దేవస్థానం సిబ్బంది సాంకేతికంగా విలీనం చేయాలని ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పది సంవత్సరాలు నడిచింది. ఈ క్రమంలో విలీనం చేయకూడదని 2001లో యాదగిరిగుట్ట ప్రధాన దేవస్థానం ఉద్యోగులు కోర్టుకెక్కారు. 2010లో హైకోర్టు యాదగిరిగుట్టలో పాత గుట్టను విలీనం చేసుకోవాలని తీర్పు చెప్పింది. కాగా, 2001లో వేసిన పిటిషన్ కోర్టులో ఉండగానే మరోమారు యాదగిరిగుట్ట ఉద్యోగులు 2006లో ఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు వ్యతిరేకంగా మరో కేసు వేశారు. దీనిపై 2012లో హైకోర్టు తీర్పునిచ్చింది. దేవస్థానం ఉద్యోగులు వారి విధులను సక్రమంగా చేసుకోవాలని, దేవాదాయ శాఖ పాలసీ విషయాలలో జోక్యం చేసుకోరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పుననుసరించి ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు 2014, ఏప్రిల్ 22న విలీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం యాదగిరిగుట్టలో పాతగుట్ట విలీనం అయినట్టేనని దేవస్థానం ఈఓ కృష్ణవేణి ఉద్యోగులకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఈ ఆదేశాలను గుట్ట ఉద్యోగస్తులు తొక్కి పట్టి బయటికి రాకుండా చేశారు. అదే విధంగా ఉద్యోగులు ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు వద్దనుంచి ఈనెల 9న స్టే ఆర్డర్‌ను తీసుకువచ్చారు. దీంతో రెండు దేవాలయాల తగాదా బహిరంగమైంది. ఆగ్రహించిన పాతగుట్ట ఉద్యోగులు ఆర్జిత సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈఓ.. పాతగుట్టకు చెందిన 15మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. పాతగుట్టలో ప్రస్తుతం యాదగిరిగుట్ట ఉద్యోగులతో నిత్య కార్యక్రమాలు చేయిస్తున్నారు.