ఆలయ పనుల పురోగతిని సీఎంకు వివరిస్తున్న స్తపతి ఆనంద్ సాయి
సాక్షి, యాదాద్రి: యాదగిరి క్షేత్రాన్ని పునఃప్రారం భించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళ వారం యాదాద్రిలో పర్యటించారు.సుమారు 8 గం టల పాటు ఆయన ప్రధానాలయంతో పాటు యాదాద్రిలో చేపట్టిన పనులను పరిశీలించి సూచ నలు చేశారు. పూర్తికావచ్చిన ఆలయ పునర్ని ర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని పరిశీలిం చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు, పరిసరాలన్నిం టినీ పరిశీలించారు.
మధ్యాహ్నం 12.40గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగి కొండపై బాలాలయానికి చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సీఎంకు పుష్పగుచ్చాలు అందజేయగా వేదపండితులు, అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. బాలాలయంలో అర్చన అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది
వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం.. పెంబర్తి కళాకారులు తీర్చిదిద్దిన ప్రధానాలయ ద్వారాలను పరిశీలించారు. ప్రాంగ ణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను తన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృ«శ్యాలను పరిశీలించారు.
గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తది తర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొం దించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాల యం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అంటూ ప్రత్యేకంగా అభినందించారు.
ఆలయ అర్చకులకు ఇళ్ల స్థలాలు
ఆలయ అర్చకులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరగా.. నిర్ణయం ఎప్పుడో తీసుకున్నం దున ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అర్చ కులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటా యించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. ‘మీకు పీఆర్సీ వస్తోందా ?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగు లను అడిగి తెలుసుకున్నారు. రింగురోడ్డు నిర్మాణ సమయంలో వాణిజ్య స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కల్యాణ కట్ట సమీపంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
త్రిదండి చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ఆలయ ప్రారం భం ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని కోరుతూ ఆలయ ఈఓ గీతకు సీఎం కేసీఆర్ అందించారు. యాదాద్రిలోని రామలింగేశ్వ రాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు, ఎమ్మె ల్యేలు, తదితరులతో కలిసి భోజనం చేశారు.
కొండ కింద పనుల పరిశీలన
సాయంత్రం.. కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్క రిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణా లను పరిశీలించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిం చారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతు న్నట్లు చెప్పారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీ లను నిర్మిస్తుందని తెలిపారు.
మద్యపానం నిషేధం
యాదాద్రి పవిత్రతను కాపాడ టానికి అందరూ సహకరించా లని, టెంపుల్ సిటీ పరిధిలో మద్య పానం, ధూమపానం నిషేధాన్ని కఠినతరంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం శాకాహారాన్నే అను మతించాలని సూచించారు.
వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్‌లు
యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐ పీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసి డెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు.
హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం
అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగ వత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవ దాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు హెలీపాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తా, సీఎం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.
ప్రతి శిల్పం ప్రత్యేకంగా పరిశీలన
ఆలయం ముందున్న వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం ప్రధాన దేవాలయ గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్రనామాలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్ర పటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.
ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రి వర్గ సహ చరులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలిం చారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్లు, క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment