విశాఖపట్నం: విశాఖ నుంచి అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లయిర్ వెళ్లాల్సిన విమానం గురువారం రద్దయింది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైజాగ్ చేరుకునే ఈ విమానం షెడ్యూల్ ప్రకారం వెంటనే తిరిగి బయలుదేరుతుంది. సాంకేతిక కారణాలతోనే గురువారం రద్దు చేశామని, యథావిధిగా రేపు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులను అధికారులు స్థానిక హోటల్‌కు తరలించి, బస కల్పించారు.