శ్రీనగర్ : శ్రీనగర్లో దట్టమైన మంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు కూడా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన విమానాలు రద్దయ్యాయి. విమానం కిందకి దిగాలంటే ఎదురుగా 1000 మీటర్ల మేర కనిపించాలని కానీ ఎదురుగా 300 నుంచి 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతమే కనిపిస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఉదయం వేళ్లలో విమానాలను రద్దు చేసినట్లు చెప్పారు.
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్వాన్స్‌డ్ ఇనుస్ట్రుమెంటేషన్ ల్యాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రిత్వశాఖలకు లోక్సభలో విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రిపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు మహబూబా ముఫ్తి వెల్లడించారు. శీతాకాలం భారీగా మంచు కురుస్తుండమే కాకుండా కొండ చరియలు విరిగి పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు.