
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.