ఇండియన్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టోర్నీ రద్దు | Indian Open Golf Tournament Cancelled Due To Coronavirus | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టోర్నీ రద్దు

Published Sat, Jul 4 2020 6:05 AM | Last Updated on Sat, Jul 4 2020 6:05 AM

Indian Open Golf Tournament Cancelled Due To Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన ‘ఇండియన్‌ ఓపెన్‌’ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ ఇప్పుడు రద్దయ్యింది. కోవిడ్‌ వల్లే ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్‌ యూనియన్‌ (ఐజీయూ) చైర్మన్‌ దేవాంగ్‌ షా శుక్రవారం ప్రకటించారు. యూరోపియన్‌ గోల్ఫ్‌ టూర్‌లో భాగంగా జరిగే ఈ టోర్నీ... వాస్తవానికి మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్‌లో జరగాల్సింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో అప్పట్లో ఈ టోర్నీని వాయిదా వేశారు. అక్టోబర్‌లో నిర్వహించాలని తొలుత భావించినా... దేశంలో వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో టోర్నీ రద్దుకే మొగ్గు చూపామని షా తెలిపారు. ‘ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్‌ ఓపెన్‌ను రద్దు చేస్తున్నాం. యూరోపియన్‌ టూర్‌ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దేవాంగ్‌ షా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement