Indian Open golf tournament
-
ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు
న్యూఢిల్లీ: మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన ‘ఇండియన్ ఓపెన్’ గోల్ఫ్ టోర్నమెంట్ ఇప్పుడు రద్దయ్యింది. కోవిడ్ వల్లే ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) చైర్మన్ దేవాంగ్ షా శుక్రవారం ప్రకటించారు. యూరోపియన్ గోల్ఫ్ టూర్లో భాగంగా జరిగే ఈ టోర్నీ... వాస్తవానికి మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్‌లో జరగాల్సింది. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పట్లో ఈ టోర్నీని వాయిదా వేశారు. అక్టోబర్‌లో నిర్వహించాలని తొలుత భావించినా... దేశంలో వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో టోర్నీ రద్దుకే మొగ్గు చూపామని షా తెలిపారు. ‘ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ఓపెన్‌ను రద్దు చేస్తున్నాం. యూరోపియన్ టూర్ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దేవాంగ్ షా అన్నారు. -
చౌరాసియానే చాంపియన్
గుర్గావ్: భారత గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి సాధించాడు. ఆదివారం స్థానిక డీఎల్ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో జరిగిన పోటీలో తను విజేతగా నిలిచాడు. చాంపియన్‌గా నిలిచినందుకు తను దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. అలాగే ఆసియా టూర్లో భాగమైన ఈ ఇండియన్ ఓపెన్‌ను వరుసగా రెండో సారి సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో జ్యోతి రణ్‌ధావా (2006, 2007) ఇలా రెండుసార్లు టైటిల్ సాధించాడు. ఓవరాల్‌గా చౌరాసియా ఈఘనత సాధించిన మూడో ఆటగాడు. కెంజీ హోసోయిషి (1967, 1968) తొలిసారిగా ఈ ఫీట్ సాధించారు. పోటీ చాలా కఠినంగా సాగినా టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని 38 ఏళ్ల చౌరాసియా తెలిపాడు. ఆసియా టూర్ టైటిల్ నెగ్గడం ఈ కోల్‌కతా గోల్ఫర్‌కు ఇది ఆరోసారి. అలాగే మరో భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి 2015లో ఈ టైటిల్ నెగ్గగా ఈసారి ఐదో స్థానంతో సరిపుచ్చుకున్నాడు.