సింగపూర్: కరోనా కారణంగా ఫార్ములావన్‌లో తాజాగా మూడు రేసులు రద్దు అయ్యాయి. వేర్వేరు కారణాలతో అజర్‌బైజాన్, జపాన్, సింగపూర్‌లలో జరగాల్సిన గ్రాండ్‌ప్రి రేసుల్ని రద్దు చేసినట్లు ఫార్ములావన్ (ఎఫ్1) యాజమాన్యం పేర్కొంది. వీధి సర్క్యూట్లను సిద్ధం చేయడంలో ఏర్పడిన సవాళ్ల కారణంగా అజర్‌బైజాన్, సింగపూర్‌లలో... ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో జపాన్ గ్రాండ్‌ప్రిను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే 8 రేసులతో కూడిన సవరించిన క్యాలెండర్‌ను ప్రకటించిన ఫార్ములావన్... జూలై 7న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో పోటీలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 22 రేసులు జరగాల్సిన ఈ సీజన్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా, డచ్, మొనాకో, ఫ్రెంచ్ రేసులు రద్దు కాగా... తాజాగా వీటికి మరో మూడు జత చేరాయి. అయితే సీజన్ రెండో భాగంలో ఎక్కువ రేసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఫార్ములావన్ మోటార్‌స్పోర్ట్స్ చీఫ్ రాస్ బ్రాన్ అన్నారు. ‘త్వరితగతిన పరిణామాలు మారిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా మా వద్ద చాలా సమయముంది. రేసుల నిర్వహణకు అనేక అవకాశాలు కనుగొంటున్నాం. యూరోప్‌లో వేదికలను పెంచుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment