ఇండియన్‌ వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ రద్దు  | Indian Wells Tennis Tournament Canceled Due To Coronavirus | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ రద్దు 

Published Tue, Mar 10 2020 1:49 AM | Last Updated on Tue, Mar 10 2020 1:49 AM

Indian Wells Tennis Tournament Canceled Due To Coronavirus - Sakshi

కాలిఫోర్నియా: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా భావించే ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్, డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నమెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రాణాంతక వైరస్‌ కోవిడ్‌–19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టోర్నమెంట్‌ వేదిక కాలిఫోర్నియాలో తాజాగా కోవిడ్‌–19 కేసు బయట పడటంతో ఈనెల 12 నుంచి 22 వరకు జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘టోర్నీని నిర్వహించలేకపోతున్నందుకు తీవ్ర నిరాశతో ఉన్నాం. అయితే ఈ టోర్నీతో ముడిపడి ఉన్న అందరి ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే టోర్నీని రద్దు చేయక తప్పడంలేదు’ అని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాదీ ఈ టోర్నీని వీక్షించేందుకు దాదాపు నాలుగు లక్షల మంది అభిమానులు వస్తారు. ఎవరైనా ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకొనిఉంటే వారికి టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement