Indian Wells
-
మెయిన్ ‘డ్రా’కు గెలుపు దూరంలో...
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నీయాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 101వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో ప్రపంచ 580వ ర్యాంకర్ స్టెఫాన్ డొస్టానిక్ (అమెరికా)పై గెలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో కొరియా ప్లేయర్ సియోంగ్చన్ హాంగ్‌తో సుమిత్ తలపడతాడు. -
Indian Wells Final: నాదల్కు భారీ షాక్.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం
Taylor Fritz Upsets Rafael Nadal Clinch Title: ఏటీపీ మాస్టర్స్ 100 టోర్నీ ఇండియన్‌వెల్స్ టోర్నీలో అమెరికా యువ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ విజేతగా నిలిచాడు. ఆదివారం 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6–3, 7–6 (7/5)తో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌పై సంచలన విజయం సాధించాడు. 2001 (ఆండ్రీ అగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్ నిలవగా... 2022లో 20 వరుస విజయాల నాదల్ జోరుకు బ్రేక్ పడింది. ఇక విజేత 24 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను గెలిచానంటే నమ్మకం కలగడం లేదని, ఇంకా షాక్‌లోనే ఉన్నానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. Just. incredible. 🤯@Taylor_Fritz97 | @BNPPARIBASOPEN | #IndianWells pic.twitter.com/UaACu8HvJ8 — ATP Tour (@atptour) March 20, 2022 -
నాదల్ ఖాతాలో 19వ విజయం
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది వరుసగా 19వ విజయం నమోదు చేశాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో నాదల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/0), 5–7, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. ఈ సీజన్లో మెల్బోర్న్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, మెక్సికో ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాదల్ నాలుగో టైటిల్‌కు రెండు విజయాల దూరంలో ఉన్నాడు. -
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ రద్దు
కాలిఫోర్నియా: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా భావించే ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్, డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రాణాంతక వైరస్ కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టోర్నమెంట్ వేదిక కాలిఫోర్నియాలో తాజాగా కోవిడ్–19 కేసు బయట పడటంతో ఈనెల 12 నుంచి 22 వరకు జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘టోర్నీని నిర్వహించలేకపోతున్నందుకు తీవ్ర నిరాశతో ఉన్నాం. అయితే ఈ టోర్నీతో ముడిపడి ఉన్న అందరి ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే టోర్నీని రద్దు చేయక తప్పడంలేదు’ అని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాదీ ఈ టోర్నీని వీక్షించేందుకు దాదాపు నాలుగు లక్షల మంది అభిమానులు వస్తారు. ఎవరైనా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకొనిఉంటే వారికి టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
‘డెవిల్’ పొట్రో...
కాలిఫోర్నియా: ఈ ఏడాది వరుసగా 17 విజయాలతో ఊపు మీదున్న నంబర్‌వన్ రోజర్ ఫెడరర్‌కు షాక్. గతంలో ఐదు సార్లు ఇదే టైటిల్ సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఊహించని పరాజయం. అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో సంచలన ప్రదర్శన ముందు ఫెడెక్స్ తలవంచాల్సి వచ్చింది. ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6–4, 6–7 (8/10), 7–6 (7/2)తో ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్–1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే ఇదే గేమ్‌లో అతను మూడు సార్లు మ్యాచ్ పాయింట్లను కోల్పోవడం అనూహ్యం! ఫెడరర్ సర్వీస్ చేసిన పదో గేమ్‌లో డెల్‌పొట్రో బ్రేక్ సాధించడం... ఆ తర్వాత ఇద్దరు తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో ఆట టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో చెలరేగిన డెల్‌పొట్రో మరో అవకాశం ఇవ్వలేదు. తాజా ప్రదర్శనతో డెల్‌పొట్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. రెండేళ్ల పాటు గాయాలతో ఆటకు దూరమై ఒక దశలో 1,045 ర్యాంక్‌కు పడిపోయిన అతను 2016లో పునరాగమనం చేసి ఇటీవలే టాప్–10లోకి అడుగు పెట్టాడు. ఫెడరర్, డెల్‌పొట్రో మధ్య ఈ ఫైనల్‌కు ముందు 24 మ్యాచ్‌లు జరగ్గా... 18 సార్లు విజయం రోజర్నే వరించింది. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్ ఖాతాలో 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి. ఇది నిజంగా చాలా పెద్ద విజయం. ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి నేను ఈ టైటిల్‌ను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. నా ఎడమ చేతి మణికట్టుకు మూడో శస్త్రచికిత్స తర్వాత ఆటను మానేయాల్సిన స్థితిలో నిలిచిన నేను ఈ క్షణాన్ని అసలు ఊహించలేదు. పునరాగమనం కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం నేను చాలా అద్భుతంగా ఆడుతున్నాననేది వాస్తవం. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తా. – డెల్ పొట్రో 4 ఫైనల్స్‌లో ఫెడరర్‌పై డెల్ పొట్రో సాధించిన విజయాల సంఖ్య. 2009 యూఎస్ ఓపెన్, 2012, 2013 బాసెల్ ఓపెన్ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను ఓడించాడు. వారెవ్వా...ఒసాకా ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 20 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా విజేతగా అవతరించింది. ఫైనల్లో ఒసాకా 6–3, 6–2తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా–1999లో), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం–2005లో) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్ కసత్‌కినాకు 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హలెప్ 3-6, 0-6 తేడాతో జపాన్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలైంది. 64 నిమిషాల పాటు జరిగిన పోరులో హలెప్ ఏ దశలోనూ ఆకట్టులేకపోయింది. అనవసర తప్పిదాలతో తొలి సెట్‌ను కోల్పోయిన హలెప్.. రెండో సెట్లో కూడా అదే పునరావృతం చేసింది. ఫలితంగా టోర్నీ నుంచి హలెప్ నిష్ర్రమించగా, ఒసాకా ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే తుదిపోరులో రష్యాకు చెందిన దారియా కసాత్కినాతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది. -
సోదరిపై వీనస్ విజయం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో నల్ల కలువ సెరెనా విలియమ్స్‌పై అక్క వీనస్ విలియమ్స్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా మూడో రౌండ్ పోరులో వీనస్ విలియమ్స్ 6-3, 6-4 తేడాతో సెరెనాపై గెలుపొందింది. సుమారు గంటకు పైగా సాగిన మ్యాచ్ లో సెరీనా 41 అనవసర తప్పిదాలు చేసింది. దీంతో వీనస్ విలియమ్స్ ను విజయం వరించింది. గతేడాది సెప్టెంబరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంది. అనంతరం ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నీలో మళ్లీ రాకెట్ చేతబట్టింది. అయితే ఈ టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన 28 మ్యాచ్‌ల్లో సెరెనా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వీనస్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందారు. అక్కా చెల్లెల్ల మధ్య జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిది మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించారు. 1998 ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరూ ముఖాముఖి పోరులో తొలిసారి తలపడగా, 2014 తర్వాత సెరెనాపై వీనస్ విజయాన్ని సాధించడం ఇదే తొలిసారి. -
2014 తర్వాత సెరెనాపై అక్క విజయం
-
ఇండియన్ వెల్స్కు షరపోవా దూరం
కాలిఫోర్నియా(అమెరికా):త్వరలో కాలిఫోర్నియాలో ఆరంభం కానున్న ఇండియన్ వెల్స్ డబ్యూటీఏ టోర్నీ నుంచి మాజీ ప్రపంచ నంబర్ వన్, రష్యన్ క్రీడాకారిణి మారియా షరపోవా ముందుగానే వైదొలిగింది. గత కొంతకాలంగా తనను వేధిస్తున్న ఎడమ చేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో ఇండియన్ వెల్స్ కు దూరంగా కావాలని షరపోవా నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొన్న షరపోవా క్వార్టర్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తరువాత ఏ టోర్నీల్లో పాల్గొనని షరపోవా.. ఈనెల 9 వ తేదీ నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ నుంచి కూడా వైదొలిగింది. 'ప్రస్తుతం నా గాయంపై దృష్టి పెట్టా. 100 శాతం ఫిట్‌గా ఉంటే ఈ టోర్నీలో పాల్గొనాలని భావించా. డబ్యూటీఏ ఈవెంట్లలో ఇదొక నా ఫేవరెట్ ఈవెంట్. కానీ గాయం ఇంకా బాధించడంతో భారంగా టోర్నీకి దూరంగా కావాల్సి వస్తుంది 'అని షరపోవా పేర్కొంది. ఈ మేరకు టోర్నీ నిర్వహకులకు గురువారం ఓ నివేదికను అందజేసింది. -
సానియా జోడీకి షాక్!
పోర్ష్ గ్రాండ్‌ప్రిలో తొలి రౌండ్లోనే ఓటమి స్టట్గార్ట్ (జర్మనీ): ప్రపంచ నంబర్‌వన్ హోదాలో తొలి సారి డబ్ల్యూటీఏ టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత స్టార్ సానియా మీర్జాకు అనూహ్య ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా-మార్టినా హింగిస్ జోడి ఇక్కడ జరుగుతున్న పోర్ష్ గ్రాండ్ ప్రి టోర్నీలో తొలి రౌండ్లో పరాజయం పాలైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియాకు చెందిన పెట్రా మార్టిక్-స్టెఫానీ జంట 6-3, 6-3 స్కోరుతో టాప్ సీడ్ సానియా-హింగిస్‌ను చిత్తు చేసింది. డబుల్స్‌లో జత కుదిరిన తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచి ఇండియన్ వెల్స్, మియామీ, సర్కిల్ కప్ టోర్నీ టైటిల్స్ సాధించిన సానియా ద్వయానికి ఇదే మొదటి ఓటమి. మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో బాధ పడిన హింగిస్ చికిత్స చేయించుకుంది. ఇది కూడా ఫలితంపై ప్రభావం చూపించింది. -
సానియా జోడి శుభారంభం
ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 6-4తో కీస్ మాడిసన్-అలీసన్ రిస్కీ (అమెరికా) జంటపై గెలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఫెడరర్ జంట చేతిలో బోపన్న జోడి ఓటమి ఇదే వేదికపై జరుగుతోన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) జోడి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 6-7 (4/7), 10-6తో ఐదో సీడ్ బోపన్న-ఖురేషి జంటను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది.