
నయోమి ఒసాకా
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హలెప్ 3-6, 0-6 తేడాతో జపాన్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలైంది. 64 నిమిషాల పాటు జరిగిన పోరులో హలెప్ ఏ దశలోనూ ఆకట్టులేకపోయింది.
అనవసర తప్పిదాలతో తొలి సెట్‌ను కోల్పోయిన హలెప్.. రెండో సెట్‌లో కూడా అదే పునరావృతం చేసింది. ఫలితంగా టోర్నీ నుంచి హలెప్ నిష్ర్రమించగా, ఒసాకా ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే తుదిపోరులో రష్యాకు చెందిన దారియా కసాత్కినాతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment