సానియా జోడి శుభారంభం | sania mirza team grand opening | Sakshi
Sakshi News home page

సానియా జోడి శుభారంభం

Published Sun, Mar 9 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

సానియా జోడి శుభారంభం

సానియా జోడి శుభారంభం

ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్‌పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 6-4తో కీస్ మాడిసన్-అలీసన్ రిస్కీ (అమెరికా) జంటపై గెలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
 
 ఫెడరర్ జంట చేతిలో బోపన్న జోడి ఓటమి
 ఇదే వేదికపై జరుగుతోన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) జోడి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 6-7 (4/7), 10-6తో ఐదో సీడ్ బోపన్న-ఖురేషి జంటను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement