ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్‌ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు.
కెనడా-భారత్ వివాదం..
ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు.
కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment