Canadian citizenship
-
ట్రక్కునే మొబైల్ హౌస్‌గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్‌గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్‌లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్‌తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
భారత్ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ
ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపర, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. ఈ వివాదంలో భాగంగానే భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెసింది కెనడా. పశ్చిమాసియా దేశాల పర్యటనల్లోనూ ట్రూడో ఈ అంశాన్ని లేవనెత్తారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల యూకే వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై స్పందించారు. నిజ్జర్ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు.. కానీ ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో దర్యాప్తు కోరకూడదని చెప్పారు. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
కెనడా ప్రధానికి చేదు అనుభవం
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. తన మద్దతుదారులను కలవడానికి వచ్చిన ట్రూడోపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెనడాను నాశనం చేస్తున్నావంటూ ట్రూడోను ఉద్దేశించి ఆరోపించాడు. దేశంలో హౌజింగ్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని వాపోయాడు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిన్ ట్రూడో తన మద్దతుదారులను కలవడానికి వచ్చారు. ఓ చిన్నపిల్లాడికి షేక్యాండ్ ఇచ్చి మరో వ్యక్తి వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తి షేక్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ట్రూడోపై విమర్శలు కురిపించాడు. కెనడాలో హౌజింగ్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం మీరే అంటూ ట్రూడోను నిలదీశాడు. ట్రూడో కలగజేసుకుని.. ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదని సమాధానమిచ్చాడు. ఇంతలో ఓ వ్యక్తి ట్రూడోను మరో సమస్యను లేవనెత్తాడు. దేశంలో కార్బన్‌కు కూడా ట్యాక్స్ విధిస్తున్నారంటూ మండిపడ్డాడు. సమాధానమిచ్చిన ట్రూడో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అంటూ బదులిచ్చారు. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 దేశ సంపదను ఉక్రెయిన్‌కు పంపుతున్నారంటూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 10 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్‌కు ఎందుకు కేటాయించారో సమాధానమివ్వాలని ప్రశ్నించాడు. కెనడాను నాశనం చేయడానికే ట్రూడో ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రశ్నతో ఇది రష్యా పన్నిన కుట్రగా ట్రూడో అభిప్రాయపడ్డారు. మద్దతుదారులను పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కెనడాకు విదేశీయుల రాక పెరగడంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. హౌజింగ్, నిత్యావసర ధరలు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ కన్జర్వేటివ్ పార్టీ గెలడానికి అనేక అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country". What do you think? pic.twitter.com/rvQux8VScn — Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023 ఇదీ చదవండి: సిరియాలో భీకర డ్రోన్ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు -
India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు రక్షణ లేదని, వాటికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు. అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య చండీగఢ్: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరైన సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్దుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్దుల్ సింగ్‌పై మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్దుల్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దుల్ 2017 డిసెంబర్లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. 'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు. అక్టోబర్ 29న వాంకోవర్‌లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్‌ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది!
‘ఎవరైనా సరే నిద్రలేస్తూనే నేను ఉద్యోగం కోసం ఎదురు చూడడం లేదు. పదిమందికి ఉపాధి కల్పించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అనుకోవాలి. ‘ఆశాపూరిత ప్రపంచాన్ని ఊహించుకున్నప్పుడే, దాన్ని నిజంగా సృష్టించగలం. నీ మార్గం ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉంటేనే అక్కడికి చేరుకుంటావు. అలా చేరుకోవడానికి నీలోని ఉత్సాహం, అంకితభావం ఇంధనంలా ఉపయోగపడతాయి’...‘మైక్రోఫైనాన్స్ దారిదీపం’గా ప్రసిద్ధుడైన మహ్మద్ యూనస్ చెప్పిన ఇలాంటి మాటలెన్నో శాన్ఫ్రాన్సిస్కోలోని షీతల్ మెహతా వాల్ష్కు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యూనస్ బాటలో నడిపించి ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. సూక్ష్మారుణ సంస్థగా మొదలైన ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది.. శాంతి లైఫ్ కెనడాలో పెరిగిన షీతల్ అక్కడి గుజరాతీ అసోసియేషన్‌లో భాగం కావడంతో ఎన్నోకుటుంబాలతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిటీ లైఫ్‌లో భాగం కావడం ద్వారా పాశ్చాత్యజీవన విధానానికి భిన్నమైన భారతీయ జీవన విధానాన్ని చూసింది. ఎన్నో విలువలు నేర్చుకుంది. వెంచర్–క్యాపిటల్ ఫండింగ్ సెక్ట్చ్డర్లో రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించిన షీతల్ బంగ్లాదేశ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మహ్మద్ యూనస్ స్ఫూర్తితో అహ్మదాబాద్ కేంద్రంగా ‘శాంతి లైఫ్’ అనే సూక్ష్మారుణ సంస్థను ప్రారంభించింది. ఇది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో ఎలా ఉండేదంటే... పేద మహిళలకు రుణాలు లభించడం కష్టం. ఒకవేళ లభించినా బారెడు వడ్డీ కట్టలేక అష్టకష్టాలు పడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో ‘శాంతి లైఫ్’ రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ సొంతకాళ్ల మీద నిలబడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామీణప్రాంత మహిళలకు స్కిల్స్ ట్రైనింగ్, ఫైనాన్షియల్ లిటరసీ... మొదలైన వాటిలో శిక్షణ ఇస్తోంది శాంతి లైఫ్. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన రావడానికి షీతల్‌కు అవకాశం ఏర్పడింది. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని దూరం చేయాలంటే ఏంచేయాలి... మొదలైన విషయాలను తెలుసుకుంది షీతల్. ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. పారిశుద్ధ్య లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘సేఫ్ శానిటేషన్’ నినాదంతో గ్రామీణప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ అవగాహనతో వారు డబ్బు పొదుపు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘రుణం తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారమే కాదు. ఒక బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది. శాంతి లైఫ్ ద్వారా రుణం తీసుకున్న ఒక మహిళ రిక్షా కొనుగోలు చేసింది. ఈ రిక్షాను ఆమె భర్త నడిపేవాడు. గతంలో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు. ఏరోజు డబ్బును ఆరోజే భార్యకు ఇస్తుంటాడు. భార్య పేరు మీద లోన్ ఉంది కాబట్టి ఆమెకు చెడ్డ పేరు రావద్దని అనుకునేవాడు భర్త. ఇలాంటి భర్తలు ఎందరో! రుణసహాయం మాత్రమే కాదు క్రమశిక్షణ పాదుకొల్పడంలో ‘శాంతి లైఫ్’ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. గ్రామీణ వృత్తికళాకారులు తయారు చేసిన యోగా బ్యాగులు, చీరెలు, దుప్పట్లను ఆన్లైన్ ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. ‘ప్రతి ఒక్కరికీ తమదైన నైపుణ్యం ఉంటుంది. అది ఇతరుల కంటే ఏ రకంగా భిన్నమైనది, ఆ నైపుణ్యం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. నైపుణ్యాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చు’ అంటుంది షీతల్. లాభాలు గడించాలనే దృష్టితో కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే అవహగానతో ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టింది షీతల్. సామాజిక నిబద్ధతతో మొదలైన ‘శాంతి లైఫ్’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా అని ప్రశ్నించుకుంటే ‘అంతకంటే ఎక్కువే’ అని జవాబు చెప్పుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ద్వారా గుజరాత్‌లోని ఎన్నోగ్రామాల ముఖచిత్రాన్ని‘శాంతి లైఫ్’ మార్చింది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం! ) -
‘నా పౌరసత్వంపై రాద్ధాంతం అవసరమా?’
ముంబై : కెనడా పౌరసత్వం విషయంలో వస్తున్న విమర్శలపై బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ట్విటర్లో మండిపడ్డారు. 'నా పౌరసత్వంపై అనవసరమైన ఆసక్తి ఎందుకో నిజంగా అర్థం కావడం లేదు. నాకు కెనడా పాస్‌పోర్టు ఉన్న విషయాన్ని నేను ఏరోజు దాచిపెట్టలేదనేది ఎంత నిజమే, గత ఏడేళ్లలో నేను కెనడా వెళ్లలేదు అనేది కూడా అంతే నిజం. భారత దేశంలోనే పని చేస్తున్నా, అన్ని రకాల పన్నులను ఇక్కడే కడుతున్నా. ఇన్నేళ్లలో భారతదేశంపై నాకున్న ప్రేమను ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. నా పౌరసత్వం విషయంలో తరచూ అనవసరమైన రాద్ధాంతం చేయడం నన్ను బాధించింది. అయినా ఎప్పటిలానే ఉడతా భక్తిగా దేశాన్ని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తా' అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. కేసరి, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథా, ఎయిర్‌లిఫ్ట్ వంటి దేశభక్తి మేళవించిన కథలతో వరుసగా సూపర్హిట్లు కొడుతున్న అక్షయ్‌కుమార్ తాజాగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలంటూ ట్విటర్లో విజ్ఞప్తి చేస్తూ.. ట్యాగ్ చేసిన ప్రముఖుల్లో అక్షయ్‌కుమార్ కూడా ఉన్నారు. అంతేకాకుండా మోదీ ట్వీట్‌కు బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తిమంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్ చెప్పుకొచ్చారు. తీరా ఓటు వేయని ఆయన అదేరోజు ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని.. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఓటు ఎందుకు వేయలేదని మీడియా ప్రశ్నించగా చెలియే.. చెలియే.. (వదిలేయండి) అంటూ దాటవేయడంతో అక్షయ్ పౌరసత్వంపై కూడా సామాజిక మాద్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది. -
కెనడియన్‌తో పెళ్లి... ఆర్మీ మేజర్ ఉద్యోగానికి ఎసరు!
న్యూఢిల్లీ: కెనడా పౌరసత్వం గల భారత సంతతి యువతిని పెళ్లాడటంతో ఓ ఆర్మీ మేజర్ ఉద్యోగానికే ఎసరొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ఎస్జీలో ఇటీవల నియమితుడైన ఆ మేజర్, 2010లో కెనడా పౌరసత్వం పొందిన భారత సంతతి యువతిని పెళ్లాడారు. పెళ్లికి ఏడాది ముందే ఆమెకు కెనడా శాశ్వత పౌరసత్వం లభించింది. ఆర్మీ అనుమతి తీసుకోకుండా ఆమెను పెళ్లాడటమే కాకుండా, ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెల్లడించని కారణంగా మేజర్‌కు చిక్కులు మొదలయ్యాయి. ఆర్మీ ఆయనపై విచారణ ప్రారంభించింది.