ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. తన మద్దతుదారులను కలవడానికి వచ్చిన ట్రూడోపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెనడాను నాశనం చేస్తున్నావంటూ ట్రూడోను ఉద్దేశించి ఆరోపించాడు. దేశంలో హౌజింగ్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని వాపోయాడు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జస్టిన్ ట్రూడో తన మద్దతుదారులను కలవడానికి వచ్చారు. ఓ చిన్నపిల్లాడికి షేక్యాండ్ ఇచ్చి మరో వ్యక్తి వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తి షేక్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ట్రూడోపై విమర్శలు కురిపించాడు. కెనడాలో హౌజింగ్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం మీరే అంటూ ట్రూడోను నిలదీశాడు. ట్రూడో కలగజేసుకుని.. ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదని సమాధానమిచ్చాడు. ఇంతలో ఓ వ్యక్తి ట్రూడోను మరో సమస్యను లేవనెత్తాడు. దేశంలో కార్బన్‌కు కూడా ట్యాక్స్ విధిస్తున్నారంటూ మండిపడ్డాడు. సమాధానమిచ్చిన ట్రూడో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అంటూ బదులిచ్చారు.
Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country".
— Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023
What do you think? pic.twitter.com/rvQux8VScn
దేశ సంపదను ఉక్రెయిన్‌కు పంపుతున్నారంటూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 10 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్‌కు ఎందుకు కేటాయించారో సమాధానమివ్వాలని ప్రశ్నించాడు. కెనడాను నాశనం చేయడానికే ట్రూడో ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రశ్నతో ఇది రష్యా పన్నిన కుట్రగా ట్రూడో అభిప్రాయపడ్డారు. మద్దతుదారులను పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు.
Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country".
— Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023
What do you think? pic.twitter.com/rvQux8VScn
2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కెనడాకు విదేశీయుల రాక పెరగడంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. హౌజింగ్, నిత్యావసర ధరలు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ కన్జర్వేటివ్ పార్టీ గెలడానికి అనేక అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.
Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country".
— Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023
What do you think? pic.twitter.com/rvQux8VScn
ఇదీ చదవండి: సిరియాలో భీకర డ్రోన్ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment