ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది.
'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు.
అక్టోబర్ 29న వాంకోవర్‌లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా-భారత్ వివాదం..
ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు.
కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
Comments
Please login to add a commentAdd a comment