కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్‌గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది.
వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్‌లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది.
ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్‌తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్‌రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment