సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. దీంతో ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశారు!.
కాగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్ షా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్ షా పర్యటన క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు.
అయితే తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో కాషాయ పార్టీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో హైదరాబాద్‌కు రాకున్నా.. కనీసం ఖమ్మం సభకైనా ఆయన నేరుగా హాజరు అయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.
చదవండి: బీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో
Comments
Please login to add a commentAdd a comment