ముంబయి : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) డైరక్టర్స్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్‌లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీ తిరస్కరించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. ' సీవోసీ కమిటీ అంబానీతో పాటు మిగతావారి రాజీనామాలను తిరస్కరించింది. రాజీనామా చేసిన వారందరూ ఆర్‌కామ్‌లో యధావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది. దివాల ప్రక్రియలో ఉన్న కంపెనీకి పరిష్కారమార్గం చూపించాలని' ఆర్‌కామ్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్‌టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది.
(చదవండి : ఆర్‌కామ్‌కు అనిల్ అంబానీ రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment