
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్–100తోపాటు అక్టోబర్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీడబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.