Dutch Open Badminton tournament
-
మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్–100తోపాటు అక్టోబర్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీడబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. -
డచ్ ఓపెన్ చాంప్ లక్ష్య సేన్
అల్మెరె (నెదర్లాండ్): మరోసారి డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ భారత షట్లర్‌కు కలిసొచ్చింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–14, 21–15తో యుసుకె ఒనోడెరా (జపాన్)పై నెగ్గాడు. ఈ విజయంతో... ఉత్తరాఖండ్‌కు చెందిన 18 ఏళ్ల లక్ష్య సేన్ తన కెరీర్లో తొలి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షలు) తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ►5 డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982లో), చేతన్ ఆనంద్ (2009లో), అజయ్ జయరామ్ (2014, 2015లలో), సౌరభ్ వర్మ (2018లో) ఈ ఘనత సాధించారు. -
డచ్ ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ ఆదివారం నెదర్లాండ్స్ లో ముగిసిన డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్ 21–19, 21–13తో జూన్ వె చెమ్ (మలేసియా)పై నెగ్గి 5,625 డాలర్ల (రూ. 4 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. 86 ఏళ్ల చరిత్ర కలిగిన డచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982), చేతన్ ఆనంద్ (2009), అజయ్ జయరామ్ (2014, 2015) ఈ ఘనత సాధించారు. -
డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్: జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న కె.శ్రీకృష్ణప్రియ (తెలంగాణ)... జర్మన్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లకు ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ ఈనెల 25 నుంచి జరగనుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ అండర్-19 స్థాయిలో మూడో ర్యాంక్‌లో, మహిళ విభాగంలో 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.