అల్మెరె (నెదర్లాండ్): మరోసారి డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ భారత షట్లర్‌కు కలిసొచ్చింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–14, 21–15తో యుసుకె ఒనోడెరా (జపాన్)పై నెగ్గాడు. ఈ విజయంతో... ఉత్తరాఖండ్‌కు చెందిన 18 ఏళ్ల లక్ష్య సేన్ తన కెరీర్‌లో తొలి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షలు) తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
►5 డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982లో), చేతన్ ఆనంద్ (2009లో), అజయ్ జయరామ్ (2014, 2015లలో), సౌరభ్ వర్మ (2018లో) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment