డచ్‌ ఓపెన్‌ విజేత సౌరభ్‌ వర్మ | Maiden World Tour titles for Mia and Sourabh varma | Sakshi
Sakshi News home page

డచ్‌ ఓపెన్‌ విజేత సౌరభ్‌ వర్మ

Published Mon, Oct 15 2018 5:23 AM | Last Updated on Mon, Oct 15 2018 5:23 AM

Maiden World Tour titles for Mia and Sourabh varma - Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సౌరభ్‌ ఆదివారం నెదర్లాండ్స్‌ లో ముగిసిన డచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్‌ 21–19, 21–13తో జూన్‌ వె చెమ్‌ (మలేసియా)పై నెగ్గి 5,625 డాలర్ల (రూ. 4 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. 86 ఏళ్ల చరిత్ర కలిగిన డచ్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ప్రకాశ్‌ పదుకొనే (1982), చేతన్‌ ఆనంద్‌ (2009), అజయ్‌ జయరామ్‌ (2014, 2015) ఈ ఘనత సాధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement