Sourabh
-
డీటైలింగ్ డెవిల్స్ ఫౌండర్ కొన్న రూ.6 కోట్ల కారు ఇదే (ఫోటోలు)
-
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు..
-
స్టేజ్‌పై లవర్‌కు లిప్‌లాక్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్..
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్d. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్‌తో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు, గాయకుడు సౌరభ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం సంకోచించదు పాయల్. తాజాగా మరోసారి తన లవర్ సౌరభ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది పాయల్ రాజ్‌పుత్. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో సౌరభ్‌తో కలిసి పాయల్ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తర్వాత సౌరభ్‌కు లిప్ కిస్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా యాంకర్ అడిగే ప్రశ్నలకు సిగ్గుతో తబ్బిబ్బయింది. హైదరాబాద్‌లో ఫ్లాట్ తీసుకున్న పాయల్ రాజ్‌పుత్ సౌరభ్‌తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కిరాతక, తీస్మార్ఖాన్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ -
క్వార్టర్స్‌లో ప్రణయ్, సౌరభ్
ఫులెర్టాన్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రణయ్, సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 21–16, 18–21, 21–16తో క్వాంగ్ హీ హో (దక్షిణ కొరియా)పై... సౌరభ్ వర్మ 21–11, 19–21, 21–12తో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించారు. ప్రణయ్, సౌరభ్‌ల మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు జరగనుండటంతో భారత క్రీడాకారుడికి సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ముఖాముఖి రికార్డులో సౌరభ్ వర్మ 3–0తో ప్రణయ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. -
హంటర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అవధ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 1–4తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 13–15, 8–15తో బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–క్రిస్టియాన్సన్ (అవధ్) జోడీ 15–12, 9–15, 15–11తో కిమ్ సా రంగ్–ఎమ్ హై వన్ (హైదరాబాద్) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మార్క్ కాల్జూ (హైదరాబాద్) 15–10, 7–15, 15–7తో లీ డాంగ్ కెయున్‌పై; సన్ వాన్ హో (అవధ్) 15–10, 15–11తో లీ హున్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇసారా–కిమ్ సా రంగ్ (హైదరాబాద్) 15–9, 15–13తో యాంగ్ లీ–క్రిస్టియాన్సన్ జంటపై గెలిచింది. మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3తో బెంగళూరు రాప్టర్స్పై నెగ్గింది. అహ్మదాబాద్ తరఫున మిక్స్డ్ డబుల్స్లోనేలకుర్తి సిక్కి రెడ్డి–సాత్విక్ సాయిరాజ్ ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, మహిళల సింగిల్స్‌లో క్రిస్టీ గిల్మోర్ గెలుపొందారు. శనివారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో పుణే సెవెన్ ఏసెస్; ఢిల్లీ డాషర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
నాడు భారత జట్టులో... నేడు అమెరికా కెప్టెన్‌గా...
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల క్రితం భారత్ తరఫున అండర్–19 ప్రపంచ కప్ ఆడిన కుర్రాడు ఇప్పుడు అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన 27 ఏళ్ల సౌరభ్ నేత్రవల్కర్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌నకు అర్హత టోర్నీ అయిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో అతను యూఎస్ఏకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. నేత్రవల్కర్ ఇప్పటికే అమెరికాకు మూడు లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేశాడు. ఇటీవలి వరకు కెప్టెన్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రంజీ క్రికెటర్ ఇబ్రహీం ఖలీల్‌ను తప్పించి అతని స్థానంలో మరో భారత ఆటగాడినే కెప్టెన్‌గా నియమించింది. 2010 అండర్–19 ప్రపంచ కప్‌లో సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ముంబై తరఫున 2013లో ఏకైక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘ఒరాకిల్’ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ మరోసారి క్రికెట్ వైపు ఆకర్షితుడయ్యాడు. నిబంధనల ప్రకారం అమెరికా తరఫున ఆడేందుకు అర్హత సాధించిన అనంతరం సత్తా చాటి జట్టులోకి ఎంపికైన సౌరభ్ ఇప్పుడు కెప్టెన్‌గా మారడం విశేషం. -
డచ్ ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ ఆదివారం నెదర్లాండ్స్ లో ముగిసిన డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరభ్ 21–19, 21–13తో జూన్ వె చెమ్ (మలేసియా)పై నెగ్గి 5,625 డాలర్ల (రూ. 4 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. 86 ఏళ్ల చరిత్ర కలిగిన డచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982), చేతన్ ఆనంద్ (2009), అజయ్ జయరామ్ (2014, 2015) ఈ ఘనత సాధించారు. -
సెమీస్‌లో సౌరభ్, మిథున్
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో భారత షట్లర్లు సౌరభ్ వర్మ , మిథున్ మంజునాథ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–14, 21–16తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) పై గెలుపొందాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సొంతం చేసుకొని సెమీస్ చేరాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మిథున్ 21–18, 21–12తో సతీశ్‌థరన్ రామచంద్రన్ (మలేసియా)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు. శనివారం జరుగనున్న సెమీఫైనల్లో మిథున్‌తో సౌరభ్ వర్మ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శుభాంకర్ డే 20–22, 15–21తో రెండో సీడ్ వ్లాదిమిర్ మాల్కోవ్ (రష్యా) చేతిలో ఓడి క్వార్టర్స్‌లోనే నిష్క్రమిం చాడు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి 9–21, 11–21తో యెన్ మై హో (మలేసియా) చేతిలో; రితూపర్ణ దాస్ 17–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో రోహన్–కుహూ ద్వయం 21–13, 21–9తో అండ్రేజ్ లొగినోవ్–లిలియా అబిబులయేవా (రష్యా) జంటపై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. మరో భారత జోడీ సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ 15–21, 8–21తో చెన్ టాంగ్ జై–యెన్ వై పీక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వెనుదిరిగింది. -
స్కూలు గేటే యమపాశంలా మారింది
న్యూఢిల్లీ : స్కూలు గేటు యమపాశంలా మారి 12ఏళ్ల విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ముంబైలోని కోపార్ ఖైరనేలో శుక్రవారం చోటుచేసుకుంది. కోపార్ ఖైరనే సెక్టార్ 11లోని సివిక్ స్యూలు గ్రౌండ్లో సౌరభ్ చౌదరి, నిలేష్ దేవ్ర్‌లు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. సౌరభ్, నిలేష్‌లు బంతి గ్రౌండ్ లోపలి నుంచి బయటకు పోకుండా ఉండాలని తెరచి ఉన్న స్కూలు గేటును మూయటానికి ప్రయత్నించారు. గట్టిగా స్కూలు గేటును కదపటంతో అదికాస్త మీద పడి ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సౌరభ్ తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సౌరభ్‌ను ఆస్పత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది అత్యవసర చికిత్స పోందుతూ అతడు కన్నుమూశాడు. నిలేష్ ప్రాణాపాయం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సౌరభ్ తండ్రి సునీల్ చౌదరి మాట్లాడుతూ.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని ఆరోపించాడు. తన కొడుకు చావుకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని సునీల్ చౌదరి కోరాడు. -
గురుసాయిదత్ ఓటమి
సెమీస్‌లో సౌరభ్ వర్మ మలేసియా ఓపెన్ జొహర్ బారు: మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ఆరో సీడ్ గురుసాయిదత్ నిష్ర్కమించగా... భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-5, 19-21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదోసీడ్ సౌరభ్ వర్మ 22-20, 18-21, 21-15తో మూడోసీడ్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై సంచలన విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో పి.సి.తులసి 17-21, 21-17, 18-21తో అంద్రియాంతి ఫిర్‌దాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్-ఆరుణ్ విష్ణు (భారత్) జోడి 21-18, 21-14తో రెండోసీడ్ వీ షెమ్ గో-కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట (భారత్) 26-28, 19-21తో సుబాక్తియర్-గ్లోరియా ఇమాన్యుయేల్ (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడింది.