
ఫులెర్టాన్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రణయ్, సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 21–16, 18–21, 21–16తో క్వాంగ్ హీ హో (దక్షిణ కొరియా)పై... సౌరభ్ వర్మ 21–11, 19–21, 21–12తో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించారు. ప్రణయ్, సౌరభ్‌ల మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు జరగనుండటంతో భారత క్రీడాకారుడికి సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ముఖాముఖి రికార్డులో సౌరభ్ వర్మ 3–0తో ప్రణయ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment