Prannoy
-
ఈసారైనా ‘ఆల్ ఇంగ్లండ్’ అందేనా!
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్‌హమ్ ఆతిథ్యమివ్వనుంది. బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్‌బమ్... మిక్స్డ్ డబుల్స్‌లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్‌గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్‌కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్‌తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది. భారత్‌కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు. -
క్వార్టర్స్‌లో ప్రణయ్, సౌరభ్
ఫులెర్టాన్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రణయ్, సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 21–16, 18–21, 21–16తో క్వాంగ్ హీ హో (దక్షిణ కొరియా)పై... సౌరభ్ వర్మ 21–11, 19–21, 21–12తో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించారు. ప్రణయ్, సౌరభ్‌ల మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు జరగనుండటంతో భారత క్రీడాకారుడికి సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ముఖాముఖి రికార్డులో సౌరభ్ వర్మ 3–0తో ప్రణయ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. -
ప్రణయ్ ముందుకు... సాయిప్రణీత్ ఇంటికి
ఆక్లాండ్: తనకంటే మెరుగైన ర్యాంకర్‌ను ఓడించి భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్ న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–14, 21–12తో ప్రపంచ 13వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ఏదశలోనూ సుగియార్తో నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు గేముల్లోనూ ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరోవైపు భారత మరో స్టార్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనా దిగ్గజం, ఏడో సీడ్ లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 12–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 17–21, 19–21తో గో వి షెమ్–తాన్ వి కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
శ్రీకాంత్, ప్రణయ్ నిష్క్రమణ
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. ఈ మెగా క్రీడల్లో భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో ఒకే ఒక్కసారి 1982 ఏషియాడ్‌లో సయ్యద్ మోదీ కాంస్య పతకాన్ని అందించాడు. ఈసారి జకార్తాలో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లలో ఒకరు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం గమనార్హం. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–23, 19–21తో 28వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... మరో మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ ప్రణయ్ 12–21, 21–15, 15–21తో 18వ ర్యాంకర్ వాంగ్‌చరొన్ కంటాఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జంట మరోవైపు మహిళల డబుల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి– అశ్విని జోడీ 21–17, 16–21, 21–19తో మీ కున్ చౌ–మెంగ్ యెన్‌లీ (మలేసియా) ద్వయంపై గెలిచింది. 1986 తర్వాత భారత తరఫున మహిళల డబుల్స్ జోడీ ఏషియాడ్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇదే ప్రథమం. -
ముగ్గురు మిగిలారు
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో బరిలోకి దిగిన గతేడాది రన్నరప్ పీవీ సింధు, మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి. ప్రపంచ 44వ ర్యాంకర్ మెటీ పౌల్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21–19, 23–21తో చెమటోడ్చి గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా రెండు గేముల్లోనూ కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు క్వాలిఫయర్ లెయుంగ్ యుట్ యీ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–18, 21–10తో గెలుపొందింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చెన్ యుఫె (చైనా)తో సైనా; అయా ఒహోరి (జపాన్)తో సింధు తలపడతారు. మూడు మ్యాచ్ పాయింట్లు వదులుకొని... పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన కశ్యప్ చేజేతులా విజయాన్ని చేజార్చుకున్నాడు. లీ డాంగ్ కెయున్ (కొరియా)తో జరిగిన తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 9–21, 20–22తో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ 20–17తో మూడు మ్యాచ్ పాయింట్లను సంపాదించాడు. ఈ దశలో కశ్యప్ వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్ 19–21, 21–17, 21–15తో హు యున్ (హాంకాంగ్)పై గెలిచి ముందంజ వేశాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కజుమసా సకాయ్ (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 15–21, 8–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో... సాయిప్రణీత్ 8–21, 16–21తో రెండో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 11–21, 21–19, 19–21తో డాంగ్పింగ్–లీ వెన్మె (చైనా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 17–21, 17–21తో ఖిమ్ వా లిమ్ (మలేసియా)–యు యోన్ సియాంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
ప్రిక్వార్టర్స్ కు కశ్యప్, ప్రణయ్
ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు. తొలుత ప్రణయ్ 23-21, 21-18 తేడాతో అబ్దుల్లా కౌలిక్(ఇండోనేసియా)పై పోరాడి గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా, కశ్యప్ 21-9, 21-8 తేడాతో ఒస్కార్ గు(న్యూజిలాండ్)పై సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. -
సెమీస్‌లో కశ్యప్, ప్రణయ్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 21–13, 21–16తో భారత్‌కే చెందిన సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 10–21, 21–15, 21–18తో కాంటా సునెయామ (జపాన్)పై గెలుపొం దాడు. ఈ ఏడాది కశ్యప్ తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం. సెమీఫైనల్స్‌లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో ప్రణయ్; క్వాంగ్ హీ హెయో (కొరియా)తో కశ్యప్ తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం (భారత్) 21–18, 22–20తో హిరోకి ఒకుముర–ఒనోదెరా (జపాన్) జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది. -
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్
పాలెంబంగ్ (ఇండోనేసియా): భారత యువ షట్లర్ ప్రణయ్ ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రణయ్ 21-11, 22-20 స్కోరుతో స్థానిక ఆటగాడు ఫిర్మన్ అబ్దుల్ ఖిలిక్పై విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్‌ల్లో మ్యాచ్ నెగ్గాడు. ప్రణయ్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.