కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో బరిలోకి దిగిన గతేడాది రన్నరప్ పీవీ సింధు, మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాయి.
ప్రపంచ 44వ ర్యాంకర్ మెటీ పౌల్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21–19, 23–21తో చెమటోడ్చి గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా రెండు గేముల్లోనూ కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు క్వాలిఫయర్ లెయుంగ్ యుట్ యీ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–18, 21–10తో గెలుపొందింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చెన్ యుఫె (చైనా)తో సైనా; అయా ఒహోరి (జపాన్)తో సింధు తలపడతారు.
మూడు మ్యాచ్ పాయింట్లు వదులుకొని...
పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన కశ్యప్ చేజేతులా విజయాన్ని చేజార్చుకున్నాడు. లీ డాంగ్ కెయున్ (కొరియా)తో జరిగిన తొలి రౌండ్‌లో కశ్యప్ 21–15, 9–21, 20–22తో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ 20–17తో మూడు మ్యాచ్ పాయింట్లను సంపాదించాడు. ఈ దశలో కశ్యప్ వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. మరోవైపు హెచ్‌ఎస్ ప్రణయ్ 19–21, 21–17, 21–15తో హు యున్ (హాంకాంగ్)పై గెలిచి ముందంజ వేశాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కజుమసా సకాయ్ (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 15–21, 8–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో... సాయిప్రణీత్ 8–21, 16–21తో రెండో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 11–21, 21–19, 19–21తో డాంగ్‌పింగ్–లీ వెన్‌మె (చైనా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 17–21, 17–21తో ఖిమ్ వా లిమ్ (మలేసియా)–యు యోన్ సియాంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.
ముగ్గురు మిగిలారు
Published Thu, Nov 23 2017 12:06 AM | Last Updated on Thu, Nov 23 2017 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment