యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్ వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4 , 7-5 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన తుది పోరులో ప్రత్యర్ధిని సిన్నర్ చిత్తు చేశాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ ఇటాలియన్ స్టార్.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల సిన్నర్‌కు ఈ ఏడాదిలో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ను కూడా సిన్నర్ సొంతం చేసుకున్నాడు.
తొలి ఇటాలియాన్‌గా..
అదే విధంగా యూఎస్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇటాలియన్‌గా సిన్నర్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు కూడా యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలవలేదు. ఇక ఈ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా సిన్నర్ అందుకున్నాడు.
చదవండి: ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment