Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్‌లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్‌తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే.
హోరాహోరీగా సాగిన క్లార్టర్స్‌లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్‌పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్‌లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం.
Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen
— Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022
📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp
కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్‌లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment