న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సంధించాడు.
తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది.
తొలి రౌండ్‌లో కిన్‌వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్‌కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్
నుంచి తప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment