
సంఘటనా స్థలం , సౌరభ్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : స్కూలు గేటు యమపాశంలా మారి 12ఏళ్ల విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ముంబైలోని కోపార్ ఖైరనేలో శుక్రవారం చోటుచేసుకుంది. కోపార్ ఖైరనే సెక్టార్ 11లోని సివిక్ స్యూలు గ్రౌండ్‌లో సౌరభ్ చౌదరి, నిలేష్ దేవ్ర్‌లు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. సౌరభ్, నిలేష్‌లు బంతి గ్రౌండ్ లోపలి నుంచి బయటకు పోకుండా ఉండాలని తెరచి ఉన్న స్కూలు గేటును మూయటానికి ప్రయత్నించారు.
గట్టిగా స్కూలు గేటును కదపటంతో అదికాస్త మీద పడి ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సౌరభ్ తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సౌరభ్‌ను ఆస్పత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది అత్యవసర చికిత్స పోందుతూ అతడు కన్నుమూశాడు. నిలేష్ ప్రాణాపాయం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
సౌరభ్ తండ్రి సునీల్ చౌదరి మాట్లాడుతూ.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని ఆరోపించాడు. తన కొడుకు చావుకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని సునీల్ చౌదరి కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment