mumbai muncipal corporation
-
రోడ్డు పాడైందని ఆ ‘బడా గణేష్’ కమిటీకి భారీగా ఫైన్!
ముంబై: ఈ నెల తొలివారంలో దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాలు ముగిసిన వారం తర్వాత ముంబై నగర పాలక సంస్థ చేసిన పని ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవ కమిటీకి పంపించిన లేఖలో.. డాక్టర్ బాబాసాహేబ్ రోడ్ నుంచి టీబీ కడమ్ మార్గ్ వరకు రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపింది బీఎంసీ ఈవార్డ్ కార్యాలయం. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
ముంబైలో 5 వేలకు పైగా కేసులు
సాక్షి ముంబై: ముంబైలో కరోనా భారీగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 5,000దాటింది. ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల మేరకు ముంబైలో 5,190 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా కోవిడ్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో మంగళవారం 3,514 కరోనా కేసులు కాగా బుధవారం ఈ సంఖ్య సుమారు రెండు వేలు పెరిగింది. ముంబైలో లాక్డౌన్ ఉండదు...! కరోనా కేంద్రంగా మారిన ముంబైలో లాక్డౌన్ విధించే అవకాశాలులేవని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఓ వైపు కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి. మరోవైపు బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం లాక్డౌన్ విధించాలని భావించడంలేదన్నారు. అయితే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు నియమ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. అదేవిదంగా కరోనా పరీక్షలు మరింత పెంచనున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర మరోసారి కరోనా మహమ్మారికి కేంద్రంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు అందించిన వివరాల మేరకు దేశంలో అత్యధికంగా 10 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులుండగా వీటిలో తొమ్మిది జిల్లాలు మహారాష్ట్రలోనివి ఉన్నాయి. మరోవైపు గడిచిన బుధవారం మహారాష్ట్రలో 31,855 కరోనా కేసులు నమోదకాగా కేవలం 15,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 95 మంది మృతి చెందారు. దీంతో రాష్టలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,47,299కి పెరిగింది. -
స్కూలు గేటే యమపాశంలా మారింది
న్యూఢిల్లీ : స్కూలు గేటు యమపాశంలా మారి 12ఏళ్ల విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ముంబైలోని కోపార్ ఖైరనేలో శుక్రవారం చోటుచేసుకుంది. కోపార్ ఖైరనే సెక్టార్ 11లోని సివిక్ స్యూలు గ్రౌండ్లో సౌరభ్ చౌదరి, నిలేష్ దేవ్ర్‌లు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. సౌరభ్, నిలేష్‌లు బంతి గ్రౌండ్ లోపలి నుంచి బయటకు పోకుండా ఉండాలని తెరచి ఉన్న స్కూలు గేటును మూయటానికి ప్రయత్నించారు. గట్టిగా స్కూలు గేటును కదపటంతో అదికాస్త మీద పడి ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సౌరభ్ తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సౌరభ్‌ను ఆస్పత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది అత్యవసర చికిత్స పోందుతూ అతడు కన్నుమూశాడు. నిలేష్ ప్రాణాపాయం నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సౌరభ్ తండ్రి సునీల్ చౌదరి మాట్లాడుతూ.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని ఆరోపించాడు. తన కొడుకు చావుకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని సునీల్ చౌదరి కోరాడు. -
‘క్లీన్ అప్’కు చరమగీతం!
సాక్షి ముంబై: క్లీన్-అప్ మార్షల్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర శుభ్రత కోసం నియమించిన క్లీన్-అప్ మార్షల్ సిబ్బంది ముంబైకర్లపై దాదాగిరి చేస్తున్నారని అన్ని పార్టీల సభ్యులు బుధవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఆరోపించారు.దీంతో ఈ పథకాన్ని బీఎంసీ మళ్లీ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిమానా విధిస్తామంటూ బెదిరించి ముంబైకర్లను మార్షల్స్ లూటీ చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సభ్యులు పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు ఈ పథకాన్ని రద్దు చేశారు. ఐదు నెలల క్రితం మళ్లీ ప్రారంభించారు. సార్వజనీక పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న వారికి, అక్కడికక్కడే జరిమానాలు విధించడం ద్వారా నగరంలో పారిశుద్ధ్యాన్ని పటిష్టపరచవచ్చనే ఆలోచనతో 2007లో బీఎంసీ ‘క్లీన్-అప్ మార్షల్’ పేరిట పథకం ప్రవేశపెట్టింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయాజనం కనిపించడం లేదని, పెపైచ్చు మార్షల్స్ దాదాగిరి చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యురాలు శీతల్ మాత్రే స్థాయీ సమితికి సోదాహరణంగా ఫిర్యాదుచేశారు. దహిసర్‌లో సొసైటీ బయట చెత్త వేయరాదని బోర్డు ఏర్పాటుచేసిన వ్యక్తుల నుంచి రూ.10 వేల జరిమానా వసూలు చేస్తున్నారని, జరిమానా విధించలేని చిన్న పిల్లలతో పనిచేయించుకుంటున్నారని, చర్యలు తీసుకోకుండా ఉండేందుకు దుకాణదారుల నుంచి రూ.ఐదు వేలు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా వుండగా క్లీన్-అప్ మార్షల్స్ విధానంపై మొదటినుంచి వివాదాలు కొనసాగుతున్నాయని స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే తెలిపారు. ఈ పథకం విషయమై వారం రోజుల్లో ఒక నివేదిక తయారుచేయాలని పరిపాలన విభాగానికి ఆదేశించామన్నారు. అనంతరం పథకాన్ని రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.