గురుసాయిదత్ ఓటమి | Sourabh enters semis, Gurusaidutt, Thulasi exit Malaysian GPG | Sakshi
Sakshi News home page

గురుసాయిదత్ ఓటమి

Published Sat, Mar 29 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

గురుసాయిదత్ ఓటమి

గురుసాయిదత్ ఓటమి

 సెమీస్‌లో సౌరభ్ వర్మ
 మలేసియా ఓపెన్
 
 జొహర్ బారు: మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ఆరో సీడ్ గురుసాయిదత్ నిష్ర్కమించగా... భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
 
  శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-5, 19-21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.  మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదోసీడ్ సౌరభ్ వర్మ 22-20, 18-21, 21-15తో మూడోసీడ్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై సంచలన విజయం సాధించాడు.  
 
 మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో పి.సి.తులసి 17-21, 21-17, 18-21తో అంద్రియాంతి ఫిర్‌దాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్-ఆరుణ్ విష్ణు (భారత్) జోడి 21-18, 21-14తో రెండోసీడ్ వీ షెమ్ గో-కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట (భారత్) 26-28, 19-21తో సుబాక్తియర్-గ్లోరియా ఇమాన్యుయేల్ (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement