Gurusaidutt
-
కశ్యప్, గురుసాయిదత్‌లకు చెరో రూ.55 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇద్దరికీ చెరో 55 లక్షల చొప్పున మొత్తం రూ. కోటీ 10 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు శనివారం తన కార్యాలయంలో కశ్యప్, గురుసాయిదత్‌లకు అందించారు. వీరిద్దరూ భవిష్యత్‌లో గొప్పగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడిన కశ్యప్, గురుసాయిదత్‌లకు మెరుగైన ట్రెయినర్లు, ఫిజియో థెరపిస్టులు, శిక్షణ కోసం ఈ సహాయాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించేందుకు, వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని వివరించారు. -
ప్రిక్వార్టర్స్‌లో గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురుసాయిదత్ 21–12, 24–22తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్ 21–16, 21–7తో దుర్కిన్‌జాక్ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 23–25, 13–21తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. -
క్వార్టర్స్‌లో గురుసాయి, జయరామ్
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు గురుసాయి దత్, అజయ్ జయరామ్ ముందంజ వేశారు. వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రీక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-14, 21-13 స్కోరుతో కాస్పెర్ లెహికోనెన్ (ఫిన్లాండ్) పై విజయం సాధించాడు. జయరామ్ క్వార్టర్స్‌లో మలేసియా ఆటగాడు జుల్కర్నెన్ జైనుద్దీన్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-12, 21-11తో దిమిత్రో జవడ్స్కీ (ఉక్రెయిన్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో రాల్ మస్ట్ (ఈస్తోనియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
గురుసాయిదత్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఏడాది విరామం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గురుసాయిదత్ ఆఖరి అడ్డంకిని అధిగమించలేకపోయాడు. బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ గురుసాయిదత్ 17-21, 21-16, 19-21తో ప్రపంచ 46వ ర్యాంకర్ పాబ్లో అబియాన్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో సుమీత్-మనూ ద్వయం 14- 21, 16-21తో రాఫెల్ బెక్-పీటర్ కాస్బూర్ (జర్మనీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: వరుసగా రెండు అలవోక విజయాలతో హైదరాబాద్ ప్లేయర్ ఆర్‌ఎంవీ గురుసాయిదత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-13, 21-9తో అయ్ వీ జియాన్ (మలేసియా)పై నెగ్గి... రెండో రౌండ్లో 21-15, 21-8తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. తొలి రౌండ్లో ప్రణవ్-అశ్విని 21-19, 21-17తో మార్క్ లామ్స్‌ఫస్-ఇసాబెల్ హెర్ట్రిచ్ (జర్మనీ)పై, రెండో రౌండ్లో 21-4, 21-6తో చామ్ చెన్-సుసాన్ వాంగ్ (ఆస్ట్రేలియా)లపై విజయం సాధించారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో కశ్యప్; విటింగస్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో గురుసాయిదత్; లిడియా యి యు (మలేసియా)తో సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఇండియా ఓపెన్ టోర్నీ న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-14, 21-9తో సతావత్ పొంగ్నైరత్ (అమెరికా)పై నెగ్గగా... రెండో రౌండ్లో 16-21, 21-14, 21-10తో థమాసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సీహెచ్ పూర్ణిమ తన భాగస్వామి సృ్మతి నాగర్‌కోటితో కలిసి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)తో; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్; లీ డాంగ్ కున్ (దక్షిణ కొరియా)తో గురుసాయిదత్ తలపడతారు. -
ఫైనల్లో రుత్విక, గురుసాయి
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యా డ్మింటన్ ప్లేయర్స్ గద్దె రుత్విక శివాని, గురుసాయిదత్ టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో రుత్విక శివాని 21-19, 21-18తో శైలి రాణే (భారత్)ను బోల్తా కొట్టించగా... పురుషుల సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-11, 21-11తో అక్షిత్ (భారత్)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో అరుంధతి (భారత్)తో రుత్విక శివాని; ప్రణయ్ (భారత్)తో గురు తలపడతారు. ఇతర సెమీఫైనల్స్‌లో అరుంధతి 21-9, 21-15తో టాప్ సీడ్ పీసీ తులసి (భారత్)పై, ప్రణయ్ 21-13, 23-21తో అజయ్ జయరామ్ (భారత్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన జె.మేఘన-కె.మనీషా ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో మేఘన-మనీషా 21-15, 21-15తో ధాన్యా నాయర్-మోహిత (భారత్)లపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-18, 21-3తో శ్లోక్ రామచంద్రన్-మేఘన జోడిని ఓడించింది. -
‘రాకెట్’ తడాఖా
సెమీస్‌లో పి.వి.సింధు, జ్వాల అశ్విని జోడి కనీసం రెండు పతకాలు ఖాయం ఏబీసీ చరిత్రలో ఇదే తొలిసారి పోరాడి ఓడిన గురుసాయిదత్ భారత బ్యాడ్మింటన్‌లో మరో కొత్త అధ్యాయం. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో మనోళ్ల రాకెట్ లాంటి ఆటతీరుకు ఒకేసారి రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో యువతార పి.వి.సింధు... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం సెమీఫైనల్‌కు దూసుకెళ్లి భారత సత్తాను చాటారు. 23 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు రావడం ఇదే ప్రథమం. గిమ్‌చియోన్ (కొరియా): నిలకడగా రాణిస్తూ పి.వి.సింధు... తమ పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు తగిన సమాధానమిస్తూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ముందంజ వేశారు. అయితే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ తీవ్రంగా శ్రమించినా విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-10తో ఒంగ్బుమ్రంగ్పాన్ బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని జోడి 21-12, 21-12తో అలిసియా-సూంగ్ ఫీ చో (మలేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్ 24-22, 9-21, 13-21తో లియు కాయ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఏబీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సింధు... లూ యింగ్లూ యు (చైనా)లతో జ్వాల -అశ్విని తలపడతారు. 1991లో మొదలైన ఏబీసీ లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్యాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా సెమీఫైనల్స్‌లో ఓడిపోయారు. గతంలో బుసానన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధుకు ఈసారి గట్టిపోటీనే లభించింది. మ్యాచ్‌లో కుదురుకునేలోపే సింధు తొలి గేమ్‌ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న ఈ తెలుగమ్మాయి రెండో గేమ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్ మ్యాచ్‌లో జ్వాల జోడి ఏదశలోనూ ప్రత్యర్థి జంటకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ 40 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించారు. ఆత్మవిశ్వాసం పెరగడంలో ఈ గొప్ప విజయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మ్యాచ్‌లో మేమిద్దరం చాలా బాగా ఆడాం. నిలకడగా రాణిస్తే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయని మా ఇద్దరికీ తెలుసు. జోడిగా మరింత ప్రాక్టీస్ చేసి, మరిన్ని మ్యాచ్‌లు ఆడితే పూర్వపు ఫామ్‌ను సాధిస్తాం. అశ్విని పొనప్ప తొలి గేమ్‌లో మినహా సింధు అద్భుతంగా ఆడింది. రెండో గేమ్ నుంచి సింధు స్మాష్‌లలో పదును పెరిగింది. ఈ అంశం విజయంలో కీలకపాత్ర పోషించింది గోపీచంద్, కోచ్ షిజియాన్ వాంగ్‌తో జరిగే సెమీఫైనల్లో సింధు ఆమెను ఓడిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. వాంగ్ బలాబలాలు, బలహీనతలపై సింధుకు మంచి అవగాహన ఉంది. రమణ (సింధు తండ్రి) 1 భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ, ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకాలు నెగ్గిన తొలి క్రీడాకారిణులుగా సింధు, జ్వాల, అశ్విని. -
గురుసాయిదత్ ఓటమి
సెమీస్‌లో సౌరభ్ వర్మ మలేసియా ఓపెన్ జొహర్ బారు: మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ఆరో సీడ్ గురుసాయిదత్ నిష్ర్కమించగా... భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-5, 19-21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదోసీడ్ సౌరభ్ వర్మ 22-20, 18-21, 21-15తో మూడోసీడ్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై సంచలన విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో పి.సి.తులసి 17-21, 21-17, 18-21తో అంద్రియాంతి ఫిర్‌దాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్-ఆరుణ్ విష్ణు (భారత్) జోడి 21-18, 21-14తో రెండోసీడ్ వీ షెమ్ గో-కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట (భారత్) 26-28, 19-21తో సుబాక్తియర్-గ్లోరియా ఇమాన్యుయేల్ (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో గురుసాయిదత్
జొహర్ బారు (మలేసియా): ఆంధ్రప్రదేశ్ షట్లర్ గురుసాయిదత్ మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో ఆరోసీడ్ గురుసాయి 23-21, 21-9 తేడాతో ఇండోనేసియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు విస్ను యులీ ప్రసెట్యోపై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్లో గురు 21-18, 22-20 తేడాతో సెంగ్ జో యో (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరగనున్న క్వార్టర్స్‌లో గురుసాయిదత్‌కు రెండో సీడ్ వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) రూపంలో కఠిన పరీక్ష ఎదురు కానుంది. భారత్‌కు చెందిన మరో ఆటగాడు సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్‌ను 21-14, 21-17తో ఓడించిన సౌరభ్ వర్మ.. ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-15, 17-21, 21-19 తేడాతో కజుమస సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. ఇక ఏపీకి చెందిన మరో ఆటగాడు సాయిప్రణీత్ పోరాటం ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. రెండో రౌండ్లో మలేసియా ఆటగాడు నూర్ మహ్మద్ అయూబ్‌పై 18-21, 21-12, 21-10 తేడాతో నెగ్గిన సాయిప్రణీత్.. తరువాతి రౌండ్లో తమసిన్ సిట్టికాన్ చేతిలో 17-21, 14-21 తేడాతో ఓడిపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 9-21, 21-17, 18-21తో నన్ వీ (హాంకాంగ్) చేతిలో ప్రి క్వార్టర్స్‌లో ఓడగా, అనూప్ శ్రీధర్, ఆదిత్య ప్రకాష్‌లు రెండో రౌండ్లోనే వెనుదిరిగారు. అనూప్ 13-21, 11-21 తేడాతో కజుమస సకాయ్ చేతిలో ఓడగా, ఆదిత్యను సిమోన్ సాంటొసో (ఇండోనేసియా) 21-17, 21-10తో ఓడించాడు. డబుల్స్‌లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జోడి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ప్రి క్వార్టర్స్‌లో భారత జోడి 17-21, 21-19, 21-19 తేడాతో థాయ్‌లాండ్ జంట అంపున్సువాన్-పటిఫట్పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి ప్రి క్వార్టర్స్‌లో 21-2, 17-21, 21-18తో భారత్‌కే చెందిన తన్వీ లాడ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-13, 17-21, 21-14తో పోహాన్యాంగ్-హంగ్యుచూన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. -
గురుసాయిదత్ శుభారంభం
రెండో రౌండ్లో సాయిప్రణీత్ మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ జొహర్ బారు (మలేసియా): మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన పది మంది భారత క్రీడాకారుల్లో ఏడుగురు మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరో సీడ్ గురుసాయిదత్, 12వ సీడ్ సాయిప్రణీత్, అన్‌సీడెడ్ చేతన్ ఆనంద్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. వీరితోపాటు సౌరభ్ వర్మ, ప్రణయ్, ఆదిత్య ప్రకాశ్, అనూప్ శ్రీధర్ కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-7, 21-8తో క్వాలిఫయర్ గౌరవ్ వెంకట్ (భారత్)ను ఓడించాడు. సాయిప్రణీత్ 21-16, 21-11తో మహబూబ్ అజిజాన్ (ఇండోనేసియా)పై, చేతన్ ఆనంద్ 21-11, 21-14తో కీజర్ అక్బర్ (ఇండోనేసియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-10, 21-16తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సౌరభ్ వర్మ 21-12, 21-17తో యాన్ కిట్ చాన్ (హాంకాంగ్)పై, అనూప్ శ్రీధర్ 21-11, 21-16తో ధర్మగుణ (ఇండోనేసియా)పై, ఆదిత్య ప్రకాశ్ 21-17, 15-21, 21-14తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై నెగ్గారు. శుభాంకర్ (భారత్) 18-21, 9-21తో టెక్ జీ సూ (మలేసియా) చేతిలో; మయాంక్ బెహల్ (భారత్) 12-21, 17-21తో యోంగ్ చెన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 18-21, 19-21తో చాయనిత్-మున్కితామోర్న్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట 11-21, 16-21తో కుర్నియావాన్-బోనా సెప్తానో (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడిపోయాయి. -
శ్రీకాంత్ x గురుసాయిదత్
న్యూఢిల్లీ: ఈసారి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనున్నాడు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21-14, 21-19తో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ)ను బోల్తా కొట్టించగా... గురుసాయిదత్ 21-13, 21-19తో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణుల ఖాతాలోనే చేరనుంది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్, 2011 జాతీయ చాంపియన్ పి.వి.సింధు (పీఎస్‌పీబీ) 21-17, 21-14తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై, రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్) 13-21, 21-13, 21-14తో సయాలీ గోఖలే (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ); గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)-మనూ అత్రి (ఏఏఐ); ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)-అక్షయ్ దివాల్కర్ (ఎయిరిండియా) జంటలు టైటిల్ కోసం పోటీపడతాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ), అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి చేరుకున్నాయి. అన్ని విభాగాల ఫైనల్స్ సోమవారం జరుగుతాయి. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ: తమ విజయపరంపరను కొనసాగిస్తూ... జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిపార్ట్మెంట్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాయిప్రణీత్, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన నాలుగో రౌండ్లో ఆరో సీడ్ సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 11-21, 21-13, 21-17తో సమీర్ వర్మ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ (పీఎస్‌పీబీ) 21-14, 21-13తో శుభాంకర్ డే (మహారాష్ట్ర)పై, గురుసాయిదత్ 21-10, 21-6తో అజయ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గారు. రోహిత్ యాదవ్ (ఏఏఐ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-7తో ఆధిక్యంలో ఉన్నదశలో గాయంతో అతని ప్రత్యర్థి వైదొలిగాడు. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ (పీఎస్‌పీబీ)తో కశ్యప్; ఆనంద్ పవార్ (ఎయిరిండియా)తో శ్రీకాంత్; అజయ్ జయరామ్ (పీఎస్‌పీబీ)తో సాయిప్రణీత్; సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ)తో గురుసాయిదత్ తలపడతారు. సింధు జోరు మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నాలుగో రౌండ్లో సింధు 21-3, 21-7తో ముద్ర ధైన్జి (ఎయిరిండియా)ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రుత్విక శివాని నాలుగో రౌండ్లో... శ్రీ కృష్ణప్రియ మూడో రౌండ్లో ఓడిపోయారు. సైలి రాణే (ఎయిరిండియా)తో జరిగిన మ్యాచ్‌లో రుత్విక 9-14తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. శ్రీ కృష్ణప్రియ 19-21, 23-25తో జాక్వలైన్ రోజ్ (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడింది. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ అమ్మాయి రీతూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నాలుగో రౌండ్లో రీతూపర్ణ దాస్ 21-12, 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా) వైదొలిగింది. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరతి సారా సునీల్ (కేరళ)తో సయాలీ గోఖలే (ఎయిరిండియా); తన్వీ లాడ్ (ఎయిరిండియా)తో రీతూపర్ణ దాస్; సైలి రాణేతో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర); పి.సి.తులసీ (కేరళ)తో సింధు పోటీపడతారు. -
గురుసాయి, సాయిప్రణీత్ ముందంజ
ముంబై: ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు గురుసాయిదత్, సాయిప్రణీత్‌లు టాటా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ముందంజ వేశారు. గురువారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన గురుసాయిదత్ 21-16, 21-7తో భారత్‌కే చెందిన ఆస్కార్ బన్సాల్‌పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిదత్ వరుస గేముల్లో అరగంటలోనే ప్రత్యర్థిని ఇంటిదారి పట్టించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21-10, 21-10తో భారత సహచరుడు మయాంక్ బెహల్‌ను కంగుతినిపించాడు. శుక్రవారం జరిగే రెండో రౌండ్లో సాయిదత్... మోహిత్ కామత్‌తో తలపడతాడు. ఏపీ సీనియర్ ఆటగాడు చేతన్ ఆనంద్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో అతను 21-18, 21-17తో కేతన్ చాహల్‌పై నెగ్గాడు. రోహిత్ యాదవ్ 21-16, 15-21 20-22తో యి సియాంగ్ యంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, వినయ్ కుమార్ రెడ్డి 17-21, 12-21తో నాలుగో సీడ్ సౌరభ్ వర్మ చేతిలో పరాజయం చవిచూశారు. మూడో సీడ్ ప్రణయ్ 21-12, 21-12తో నిగెల్ డి సాపై, 8వ సీడ్ అనూప్ శ్రీధర్ 21-12, 21-5తో ఇండోనేసియాకు చెందిన నటాలీ ఎర్నెస్తాన్ సులిత్సోపై గెలుపొందారు. మహిళల సింగిల్స్‌లో తృప్తి ముర్గుండే 21-9, 21-17తో సంస్కృతి ఛాబ్రాపై, సయాలీ గోఖలే 21-5, 21-10తో సిరి చందనపై, లేఖ హందుంకుట్టిహెటిజ్ (శ్రీలంక) 21-11, 21-17తో విశాలాక్షిపై విజయం సాధించారు. -
టాప్ సీడ్‌గా గురుసాయిదత్
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు గురుసాయిదత్‌కు టాప్ సీడింగ్ కేటాయించారు. మరో తెలుగు కుర్రాడు సాయిప్రణీత్‌కు రెండో సీడింగ్ లభించింది. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. గురువారం నుంచి మెయిన్ ‘డ్రా’ పోటీలు ఆరంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చేతన్ ఆనంద్, వినయ్ కుమార్ రెడ్డి, రోహిత్ యాదవ్, ఎన్వీఎస్ విజేత, అజయ్ కుమార్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రాష్ట్రానికి చెందిన సీఎం శశిధర్, బాలూ మహేంద్ర, సృజన్ నందలూరి, కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్నారు. 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,125 డాలర్ల (రూ. 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇస్తారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓలేటి సిరి చందన, సంతోషి హాసిని, వడ్డేపల్లి ప్రమద పోటీపడుతున్నారు. -
టాప్ సీడ్‌గా గురుసాయిదత్
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు గురుసాయిదత్‌కు టాప్ సీడింగ్ కేటాయించారు. మరో తెలుగు కుర్రాడు సాయిప్రణీత్‌కు రెండో సీడింగ్ లభించింది. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. గురువారం నుంచి మెయిన్ ‘డ్రా’ పోటీలు ఆరంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చేతన్ ఆనంద్, వినయ్ కుమార్ రెడ్డి, రోహిత్ యాదవ్, ఎన్వీఎస్ విజేత, అజయ్ కుమార్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రాష్ట్రానికి చెందిన సీఎం శశిధర్, బాలూ మహేంద్ర, సృజన్ నందలూరి, కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్నారు. 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,125 డాలర్ల (రూ. 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇస్తారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓలేటి సిరి చందన, సంతోషి హాసిని, వడ్డేపల్లి ప్రమద పోటీపడుతున్నారు.