క్వార్టర్స్లో గురుసాయి, జయరామ్ | Jayaram, Guru reach quarterfinals of Dutch Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో గురుసాయి, జయరామ్

Published Fri, Oct 9 2015 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Jayaram, Guru reach quarterfinals of Dutch Open

అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు గురుసాయి దత్, అజయ్ జయరామ్ ముందంజ వేశారు. వీరిద్దరూ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రీక్వార్టర్స్లో అజయ్ జయరామ్ 21-14, 21-13 స్కోరుతో కాస్పెర్ లెహికోనెన్ (ఫిన్లాండ్) పై విజయం సాధించాడు.

 

జయరామ్ క్వార్టర్స్లో మలేసియా ఆటగాడు జుల్కర్నెన్ జైనుద్దీన్తో తలపడతాడు. మరో మ్యాచ్లో గురుసాయి 21-12, 21-11తో దిమిత్రో జవడ్స్కీ (ఉక్రెయిన్)ను ఓడించాడు. క్వార్టర్స్లో రాల్ మస్ట్ (ఈస్తోనియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement