Dutch Open Grand Prix
-
Dutch GP 2022: వెల్డన్ వెర్స్టాపెన్
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ (ఎఫ్1) 2022 సీజన్లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి ఈనెల 11న జరుగుతుంది. విజేత వెన్నెల–శ్రియాన్షి జోడీ పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో కలగొట్ల వెన్నెల–శ్రియాన్షి వలిశెట్టి (భారత్) జోడీ అండర్–19 మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెన్నెల–శ్రియాన్షి ద్వయం 21–19, 21–18తో నర్దన–రిధి కౌర్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) 25–23, 17–21, 10–21తో సరున్‌రక్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దివ్యం అరోరా–రిధి కౌర్ (భారత్) జోడీ టైటిల్ దక్కించుకుంది. -
ఎదురులేని వెర్స్టాపెన్
జాండ్వోర్ట్: సొంత ప్రేక్షకుల మధ్య రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేకుండా పోయింది. 36 ఏళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్లో పునరాగమనం చేసిన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈ నెదర్లాండ్స్ డ్రైవరే విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల పాటు ఆదివారం జరిగిన ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించిన వెర్స్టాపెన్ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ల్యాప్ ల్యాప్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ గమ్యాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విన్నర్‌గా నిలిచాడు. సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా... ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గ్యాస్లీ (ఆల్ఫా టారీ), లెక్లెర్క్ (ఫెరారీ) నిలిచారు. తాజా విజయంతో వెర్స్టాపెన్ డ్రైవర్ చాంపియన్íÙప్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతడు 224.5 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్ల తేడాతో హామిల్టన్ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు. -
క్వార్టర్స్‌లో గురుసాయి, జయరామ్
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు గురుసాయి దత్, అజయ్ జయరామ్ ముందంజ వేశారు. వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రీక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-14, 21-13 స్కోరుతో కాస్పెర్ లెహికోనెన్ (ఫిన్లాండ్) పై విజయం సాధించాడు. జయరామ్ క్వార్టర్స్‌లో మలేసియా ఆటగాడు జుల్కర్నెన్ జైనుద్దీన్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-12, 21-11తో దిమిత్రో జవడ్స్కీ (ఉక్రెయిన్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో రాల్ మస్ట్ (ఈస్తోనియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.