మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఇండియా ఓపెన్ టోర్నీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 21-14, 21-9తో సతావత్ పొంగ్‌నైరత్ (అమెరికా)పై నెగ్గగా... రెండో రౌండ్‌లో 16-21, 21-14, 21-10తో థమాసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.
మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సీహెచ్ పూర్ణిమ తన భాగస్వామి సృ్మతి నాగర్‌కోటితో కలిసి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్ క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)తో; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సెన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్; లీ డాంగ్ కున్ (దక్షిణ కొరియా)తో గురుసాయిదత్ తలపడతారు.