
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ100 బోనితా స్ప్రింగ్స్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ప్రపంచ 309వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో క్రిస్టినా రోస్కా (అమెరికా)పై గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రషి్మక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. చివరి రౌండ్‌లో రషి్మక 4–6, 4–6తో విక్టోరియా (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment