
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... సహజ యామలపల్లి సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి, డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రష్మిక 6–1, 2–6, 6–1తో మర్వాయోవా (స్లొవేకియా)పై గెలిచింది.
డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అకీకో ఒమాయి–మె యామగుచి (జపాన్) జోడీపై నెగ్గింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ 1–6, 4–6తో మనన్‌చాయ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ–జీల్ దేశాయ్ (భారత్) జోడీ 6–1, 6–2తో సౌమ్య (భారత్)–మె హసెగావ (జపాన్) జంటపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment