India Open Super Series
-
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్ చి లీ–ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్కోల్ఫన్–ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
India Open: ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్కు బిగ్‌షాక్
ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అక్సెల్సన్ (డెన్మార్క్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) 22–20, 10–21, 21–12తో అక్సెల్సన్ను తన కెరీర్లో తొలిసారి ఓడించి విజేతగా నిలిచాడు. కున్లావుత్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. టాప్ సీడ్‌పై గెలిచి... విజేతగా నిలిచి... ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోరీ్నలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆన్ సె యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 15–21, 21–16, 21–12తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ టైటిల్. విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సైనాపై సింధు పైచేయి
వరుస గేముల్లో అద్భుత విజయం ⇒ఆద్యంతం హోరాహోరీ పోరు ⇒సమీర్ వర్మ పరాజయం ⇒ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పాయింట్ పాయింట్‌కూ పోరాటం... ఒకసారి డ్రాప్ షాట్లు కొడితే... మరోసారి స్మాష్‌లు... ఆద్యంతం ఆధిపత్యం కోసం పోటాపోటీ... వెరసి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు అందర్నీ అలరించింది. చివరకు... ఏడాది కాలంగా అద్భుతమైన ఫిట్నెస్ తోపాటు ఫామ్‌లో ఉన్న సింధు పైచేయి సాధించింది. అంతర్జాతీయ స్థాయి టోర్నీలో సైనాపై సింధుకిదే తొలి విజయం. ఈ గెలుపుతో 2014 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో సైనా చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్టయింది. న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఊరిస్తోన్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించే దిశగా భారత స్టార్ పీవీ సింధు ఒక అడుగు ముందుకేసింది. భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై వరుస గేముల్లో నెగ్గిన సింధు ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 47 నిమిషాల్లో 21–16, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సింధు తలపడుతుంది. సుంగ్ జీ హున్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6–4తో ఆధిక్యంలో ఉంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–10, 20–22, 21–14తో మినత్సు మితాని (జపాన్)పై, సుంగ్ జీ హున్ 21–16, 22–20తో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై, అకానె యామగుచి (జపాన్) 21–13, 11–21, 21–18తో నోజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచారు. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచితో కరోలినా మారిన్ ఆడుతుంది. ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు 2013లో ఏకైకసారి సెమీఫైనల్‌కు చేరింది. గత ఏడాది నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న సింధు అంచనాలకు తగ్గట్టు రాణించగా... ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ఫిట్నెస్ను సంతరించుకుంటున్న సైనా కూడా కొన్నిసార్లు మెరిపించింది. అయితే కీలకదశలో తడబాటుకు లోనుకాకుండా ఆడిన సింధు పైచేయి సాధించింది. మ్యాచ్ మొత్తంలో సింధు, సైనాలు కొన్నిసార్లు ఆడిన స్మాష్ షాట్లు హైలైట్‌గా నిలిచాయి. తొలి గేమ్ ఆరంభంలో స్కోరు 9–9తో సమంగా ఉన్నదశలో సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–9తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా ఆధిపత్యం చలాయించినా... చివర్లో ఒత్తిడికి లోనైంది. సింధు 16–19తో వెనుకబడిన దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–19తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో పాయింట్ గెలిచి 20–20తో సమఉజ్జీగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా రెండు కళ్లు చెదిరే షాట్లతో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ముగిసిన సమీర్ పోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక క్రీడాకారుడు సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సమీర్ 22–24, 19–21తో పోరాడి ఓటమి చవిచూశాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)పై సంచలన విజయాలు సాధించిన సమీర్ ఈసారి మాత్రం కీలకదశలో పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఇండియా ఓపెన్ టోర్నీ న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-14, 21-9తో సతావత్ పొంగ్నైరత్ (అమెరికా)పై నెగ్గగా... రెండో రౌండ్లో 16-21, 21-14, 21-10తో థమాసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సీహెచ్ పూర్ణిమ తన భాగస్వామి సృ్మతి నాగర్‌కోటితో కలిసి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)తో; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్; లీ డాంగ్ కున్ (దక్షిణ కొరియా)తో గురుసాయిదత్ తలపడతారు. -
అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష
భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా సైనా ఈసారైనా నెగ్గేనా? నేటి నుంచే ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలువురు టాప్ షట్లర్లు పాల్గొంటున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌కు నేడే తెరలేవనుంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌తో సహా దాదాపు స్థానిక క్రీడాకారులందరికీ క్లిష్టమైన డ్రాలే ఎదురు కానుండడంతో టోర్నీపై గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి నెలకొంది. భారత షట్లర్లలో సైనాకు మాత్రమే సీడింగ్ (8వ) లభించింది. ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ రచానోక్ (థాయ్‌లాండ్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. సైనాకు తొలిరౌండ్లో సిమోన్ ప్రచ్ (ఆస్ట్రియా) రూపంలో తేలికైన ప్రత్యర్థే ఎదురు పడనున్నా, క్వార్టర్స్‌కు చేరితే మాత్రం ఎనిమిదో సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో కఠిన పరీక్షే కానుంది. ఈ టోర్నీ గత మూడు ఎడిషన్లలో రెండో రౌండ్ దాటలేకపోయిన సైనా... ఈసారి తన రికార్డును మెరుగు పరచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక హైదరాబాద్ రైజింగ్ స్టార్ సింధు తొలి రౌండ్లోనే రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. అయితే ఇటీవల స్విస్ ఓపెన్‌లో సింధు... షిజియాన్‌ను ఓడించడంతోపాటు ఓవరాల్‌గా ఆమెపై 3-0 రికార్డు కలిగి ఉండడం మానసికంగా పైచేయిగా కనిపిస్తోంది. ఇక ఇండియా ఓపెన్‌లో గత రెండు టోర్నీల్లో వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్‌కు చేరిన సింధుకు మంచి రికార్డే ఉంది. లీ చోంగ్ వీ (మలేసియా) టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌కు తాజా ర్యాంకింగ్ కారణంగా క్లిష్టమైన డ్రానే లభించింది. తొలిరౌండ్లోనే కశ్యప్ ఆరోసీడ్ చైనా ఆటగాడు జెంగ్‌మింగ్ వాంగ్‌తో తలపడాల్సివస్తోంది. మలేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌరభ్ వర్మ, కె.శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్ వంటివారు భారత్ తరపున ప్రధాన ఆటగాళ్లు కాగా... మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, తన్వీ లాడ్, తృప్తి ముర్గుండే, సైలి రాణే, అరుంధతి లాంటి ద్వితీయశ్రేణి క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె, ప్రజక్తా సావంత్-ఆరతి జోడీలు, మిక్స్‌డ్‌లో తరుణ్ కోన-అశ్విని, విష్ణు-అపర్ణా బాలన్ జంటలపై అంచనాలున్నాయి