ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అక్సెల్‌సన్ (డెన్మార్క్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) 22–20, 10–21, 21–12తో అక్సెల్‌సన్‌ను తన కెరీర్‌లో తొలిసారి ఓడించి విజేతగా నిలిచాడు. కున్లావుత్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.
టాప్ సీడ్‌పై గెలిచి... విజేతగా నిలిచి...
ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోరీ్నలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆన్ సె యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 15–21, 21–16, 21–12తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్ కెరీర్‌లో ఇది 12వ అంతర్జాతీయ టైటిల్. విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment