Akane Yamaguchi
-
India Open: ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్కు బిగ్‌షాక్
ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అక్సెల్సన్ (డెన్మార్క్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) 22–20, 10–21, 21–12తో అక్సెల్సన్ను తన కెరీర్లో తొలిసారి ఓడించి విజేతగా నిలిచాడు. కున్లావుత్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. టాప్ సీడ్‌పై గెలిచి... విజేతగా నిలిచి... ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోరీ్నలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆన్ సె యంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 15–21, 21–16, 21–12తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ టైటిల్. విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్‌కు 59,500 డాలర్ల (రూ. 48 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీఫైనల్లో అడుగు పెట్టిన పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధూ.. పాన్‌కు చెందిన అకానె యమగుచిపై 21-15, 20-22, 21-13 స్కోర్‌తో విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. కాగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం జరగనున్న సెమీఫైనల్లో చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో సింధు తలపడనుంది. చదవండి: India Tour of Ireland: టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం -
'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో పీవీ సింధు అలవోకగా విజయం సాధించింది. ఇక రెండో గేమ్ లో యామగుచి పుంజుకోవడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మ్యాచ్ రిఫరీలు సింధు విషయంలో ప్రవర్తించిన తీరు ఇక్కడ వివాదాస్పదంగా మారింది. రెండో గేమ్ లో స్కోర్లు 14-12తో సింధు లీడ్ లో ఉన్న సమయంలో అంపైర్లు సింధు కు ఒక పాయింట్ ను పెనాల్టీగా విధించారు. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్ ను పెనాల్టీగా ప్రకటించారు. దీనిపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపు అంపైర్లతో వాగ్వివాదానికి కూడా దిగింది. అనంతరం సింధు ఆట గాడి తప్పగా.. అద్బుతంగా ఆడిన యామగుచి ఆ గేమ్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. Nice umpiring! #BAC2022 pic.twitter.com/3EgLS4kW7n — Sammy (@Sammy58328) April 30, 2022 -
BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా యమగుచి
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో జరిగిన తుది పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జపాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యమగుచి పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు ప్రపంచ రెండో సీడ్, థాయ్ జోడీ డెచాపోల్ పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ ద్వయం ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్ జపాన్ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. చదవండి: బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు.. -
PV Sindhu: అదరగొట్టిన సింధు.. ఫైనల్లో అడుగు
BWF World Tour Finals 2021: Sindhu Beats Yamaguchi to Enter Into the Final: సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ ఫైనల్స్‌లో భాగంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. మహిళల సింగిల్స్ గ్రూపు ఏలో సెమీ ఫైనల్ చేరిన ఆమె.. అకానె యమగూచి(జపాన్)ని ఓడించింది. తద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది. డెబ్బై నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-15, 15-21, 21-19 తేడాతో యమగూచిపై విజయం సాధించింది. కాగా ఫైనల్లో సింధు... దక్షిణ కొరియా ప్లేయర్ సెయంగ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీ ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించాడు. కాగా ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలిపింక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచిన ఈ వెండికొండ... ఏకంగా రెండు ఒలిపింక్ పతకాలు తన ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. -
సింధుకు షాక్
గ్వాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ పీవీ సింధుకు తొలి లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 21–18, 18–21, 8–21తో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను గెలిచి, రెండో గేమ్‌లో 11–6తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా సాగింది. అయితే ఈ ఏడాది సింధుతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ యామగుచి పట్టువిడవకుండా పోరాడింది. స్కోరు 11–15తో ఉన్నదశలో యామగుచి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–15తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధుపై మరింత ఒత్తిడి పెంచిన యామగుచి గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో యామగుచి చెలరేగిపోగా... సింధు డీలా పడింది. ఆరంభంలోనే 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన యామగుచి ఆ తర్వాత సింధుకు ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడుతుంది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో సింధు తప్పనిసరిగా గెలవాలి. ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో చెన్ యుఫెపై ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది చెన్ యుఫెతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సింధునే నెగ్గింది. సింధుకు డోప్ పరీక్ష! యామగుచితో మ్యాచ్ ముగిసిన తర్వాత సింధుకు డోప్ పరీక్ష నిర్వహించారు. గత రెండు నెలల్లో సింధుకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆధ్వర్యంలో నాలుగుసార్లు (డెన్మార్క్, పారిస్, హైదరాబాద్) డోప్ టెస్టులు జరిగాయని సింధు తండ్రి రమణ తెలిపారు. నేడు చైనా ప్లేయర్ చెన్ యుఫెతో మ్యాచ్ ఉందనగా చైనా కాలమానం ప్రకారం రాత్రి ఒకటిన్నరకు సింధుకు డోప్ టెస్టు నిర్వహించడంపట్ల రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో మ్యాచ్‌కు ముందు సింధుకు తగిన విశ్రాంతి లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
రన్నరప్‌తో సరి
ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశ ఎదురైంది. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ ఆడిన ఆమె ఇండోనేసియా ఓపెన్‌లో తుది మెట్టుపై బోల్తా పడింది. తన ఫైనల్ ప్రత్యర్థిపై పదిసార్లు నెగ్గిన రికార్డు ఉన్నప్పటికీ కీలక తరుణంలో తప్పిదాలతో సింధు మూల్యం చెల్లించుకొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతంలో సింధుపై పద్నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లే నెగ్గిన అకానె యామగుచి ఈ సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో టైటిల్‌ను సాధించింది. జకార్తా: క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులపై అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 15–21, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత అకానె యామగుచికి 87,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 60 లక్షల 28 వేలు)తోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 42,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షల 28 వేలు)తోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత డిసెంబర్లో సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అనంతరం సింధుకు ఇండోనేసియా ఓపెన్ రూపంలో ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే అవకాశం వచ్చింది. కానీ 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు కీలకదశలో తప్పిదాలు చేసి విజయానికి దూరమైంది. వివిధ టోర్నీల్లో యామగుచితో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితం రాబట్టలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై అలవోకగా నెగ్గిన సింధు తుది సమరంలో మాత్రం వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది జర్మన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచిన యామగుచి ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడింది. పలుమార్లు వెనుకపడ్డా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి సింధు ఆట కట్టించింది. తొలి గేమ్‌లో సింధు 14–12తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో... యామగుచి అద్భుత ఆటతీరుతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించగా... వెంటనే యామగుచి మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు యామగుచి రెండు పాయింట్లు గెలిచి 6–4తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యామగుచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘అకానె యామగుచి అద్భుతంగా ఆడింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీల్లో ఆమెనే పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో నేను రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో తప్పిదాలు చేశాను. ఈ అవకాశాలను ఆమె అనుకూలంగా మల్చుకుంది. నేను తొలి గేమ్‌లో గెలిచిఉంటే తుది ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో యామగుచికి నేను ఆరేడు పాయింట్ల ఆధిక్యం ఇచ్చాను. దాంతో నేను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. తుది ఫలితం నిరాశపరిచినా ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడనున్నాను. అక్కడ మరింత మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది.’ –పీవీ సింధు -
ఆ ప్రశ్న ఇక అడగరేమో!
పక్కా ప్రణాళిక... సరైన వ్యూహాలు... చెక్కు చెదరని ఏకాగ్రత... కీలక దశలో ఒత్తిడికి లోనుకాకుండా దృఢచిత్తంతో ఉండటం... వెరసి ఈ సీజన్లో తనకు లోటుగా ఉన్న అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ అందడంలో ముఖ్యపాత్ర పోషించాయని పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన అనంతరం చైనాలోని గ్వాంగ్జౌ నుంచి సింధు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. కెరీర్‌లోని గొప్ప విజయంపై వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ప్రత్యేక వ్యూహాలు... వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు భారత్‌లో జరిగిన సయ్యద్ మోదీ టోర్నమెంట్లో బరిలోకి దిగకపోవడం మేలు చేసింది. ఆ సమయాన్ని నేను ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు వినియోగించుకున్నాను. ఈ ఏడాది నాకు ఇబ్బంది కలిగించిన, నన్ను ఓడించిన క్రీడాకారిణులు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఐదుగురికి ఐదు ప్రత్యేక వ్యూహాలు రచించాం. మ్యాచ్‌ల్లో వాటిని అమలుచేసి అనుకున్న ఫలితాన్ని సాధించాం. ఎంతో ప్రత్యేకం... వరల్డ్ టూర్ ఫైనల్స్ విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ ఏడాది నేను సాధించిన తొలి టైటిల్ ఇదే కావడం... వరుస ఫైనల్స్ పరాజయాలకు బ్రేక్ పడటంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కొంతకాలంగా ఎక్కడి వెళ్లినా తరచూ ఫైనల్స్‌లో ఓడిపోతున్నావెందుకు అనే ప్రశ్న ఎదురైంది. ఇక మీదట నాకు అలాంటి ప్రశ్న మళ్లీ ఎదురుకాదేమోనని భావిస్తున్నాను. గతేడాది ఇదే టోర్నీ ఫైనల్స్‌లో విజయం అంచుల్లో నిలిచి ఓడిపోయాక ఎంతో బాధపడ్డాను. ఈసారి మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. తేలిగ్గా తీసుకోలేదు... జపాన్ క్రీడాకారిణులు ఒకుహారా, యామగుచిలతో ఆడే మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగుతాయి. ఎక్కువగా ర్యాలీలు ఉంటాయి. ఈసారీ అదే జరిగింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయాన్ని అందుకున్నాను. ఈ టోర్నీలో ఎవరినీ తేలిగ్గా తీసుకోలేదు. తదుపరి లక్ష్యం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్... ఈ విజయంతో సింధు మదిలో నుంచి ఫైనల్లో ఓడిపోతున్నాననే అంశం వెళ్లిపోతుందని అనుకుంటున్నా. టోర్నీ మొత్తం సింధు ఆటతీరు అద్భుతంగా ఉంది. ఎంతో నాణ్యమైన క్రీడాకారిణులపై ఆమె గెలిచింది. వచ్చే ఏడాది మా ప్రధాన లక్ష్యం ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించడమే. 2001లో నేను టైటిల్ సాధించాక భారత్ నుంచి మరో ప్లేయర్‌కు ఈ టైటిల్ లభించలేదు. వచ్చే ఏడాది ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నాం. అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్, 2022 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించడం మా భవిష్యత్ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ ‘సిల్వర్ సింధు’ కాదు... సింధు విజయం అద్భుతం. ఏడాది చివరికొచ్చేసరికి ‘సిల్వర్ సింధు’ కాదు భారత బ్యాడ్మింటన్ ‘గోల్డెన్ గర్ల్’ అని తన గెలుపుతో సింధు నిరూపించింది. ఈసారి టైటిల్‌తో తిరిగొస్తాననే విశ్వాసంతో ఆమె వెళ్లింది. తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించింది. సింధు ప్రదర్శనపట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. అన్ని మ్యాచ్‌లను సింధు ఎంతో ఓపికతో, పక్కా ప్రణాళికతో ఆడింది. కొత్త చరిత్రను లిఖించింది. – పీవీ రమణ (సింధు తండ్రి) ప్రశంసల వెల్లువ... వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ విజేత పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె విజయాన్ని కొనియాడారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు సింధుకు అభినందనలు తెలిపారు. ‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అభినందించింది. విజేతగా నిలిచిన సింధుకు రూ. 10 లక్షల నగదు పురస్కారం... పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సమీర్ వర్మకు రూ. 3 లక్షలు అందజేయనున్నట్లు ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. -
సాధించింది... మన బంగారం
కొడితే కుంభస్థలం కొట్టాలి. భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అదే చేసింది. ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... గత 15 నెలల కాలంలో తాను ఫైనల్‌కు చేరిన ఏడు టోర్నమెంట్లలో తుది మెట్టుపై బోల్తా పడిన ఆమె ఎనిమిదోసారి మాత్రం అద్భుతమే చేసింది. సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా అవతరించింది. గతంలో ఏ భారతీయ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. తన అసమాన ఆటతీరుతో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణించినప్పటికీ... లోటుగా ఉన్న టైటిల్‌ను సీజన్ ముగింపు టోర్నమెంట్లో సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. గ్వాంగ్జౌ (చైనా): ఏ లక్ష్యంతోనైతే పీవీ సింధు చైనాకు బయలుదేరిందో దానిని సగర్వంగా పూర్తి చేసింది. ‘ఫైనల్ ఫోబియా’ అలవాటు అయిందని క్రీడా విశ్లేషకులు చేస్తున్న విమర్శలకు... తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకొని తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. 2018 బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో 23 ఏళ్ల సింధు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 62 నిమిషాల్లో 21–19, 21–17తో ప్రపంచ ఐదో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు స్వర్ణ పతకంతోపాటు లక్షా 20 వేల డాలర్ల (రూ. 86 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ... 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ ఒకుహారాకు రజత పతకంతోపాటు 60 వేల డాలర్ల (రూ. 43 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ... 10,200 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. వరుసగా మూడో ఏడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సింధు 2016లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2017లో అకానె యామగుచి (జపాన్)తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. మూడో ప్రయత్నంలో మాత్రం తన పతక వర్ణాన్ని రజతం నుంచి స్వర్ణంగా మార్చుకుంది. ఒకుహారాతో 13సారి తలపడిన సింధు ఈసారి ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగింది. గతంలో వీరి మ్యాచ్‌ల్లో 50 నుంచి 60 షాట్లతో కూడిన ఎన్నో సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. ఈసారి అలాంటి సుదీర్ఘ ర్యాలీలు జరుగకుండా సింధు జాగ్రత్త పడింది. సాధ్యమైనంత దూకుడుగా ఆడిన ఈ తెలుగు తేజం తొలి గేమ్ ఆరంభంలోనే 14–6తో ఎనిమిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ సింధు ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న ఒకుహారా నెమ్మదిగా తేరుకుంది. స్కోరును 16–16 వద్ద సమం చేసింది. అయితే కీలకదశలో సింధు ఏకాగ్రత చెదరకుండా, ఓపికతో ఆడింది. స్కోరు 17–17 ఉన్నపుడు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20–17తో ముందంజ వేసింది. అయితే పట్టువదలని ఒకుహారా రెండు పాయింట్లు నెగ్గి సింధు ఆధిక్యాన్ని 20–19కి తగ్గించింది. ఈ దశలో సుదీర్ఘ ర్యాలీని అద్భుతమైన డ్రాప్ షాట్‌తో ముగించి సింధు తొలి గేమ్‌ను 29 నిమిషాల్లో 21–19తో కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా మొదలైంది. ఆరంభంలోనే సింధు 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఒకుహారా తీవ్రంగా పోరాడింది. వరుసగా మూడు పాయింట్లు గెలిచి స్కోరును 7–7తో సమం చేసింది. గతంలో ఆధిక్యాన్ని కోల్పోయినపుడు ఆందోళనతో అనవసర తప్పిదాలు చేసిన సింధు ఈసారి మాత్రం పాయింట్లు పోతున్నా కంగారు పడలేదు. తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి తేరుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. కీలకదశలో పైచేయి సాధించిన సింధు 11–9 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ఒకుహారాకు స్కోరును సమం చేసే అవకాశం ఇవ్వలేదు. 20–17 వద్ద సింధు స్మాష్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి విజయగర్జన చేసింది. 20–17 వద్ద సింధు స్మాష్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి విజయగర్జన చేసింది. ►కెరీర్లో సింధు సాధించిన అంతర్జాతీయ టైటిల్స్ సంఖ్య -14 ►వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది.-5 ►ఈ టోర్నీలో సింధు కోర్టులో గడిపిన మొత్తం నిమిషాలు. 265 ►ఈ టోర్నీలో సింధు నెగ్గిన గేమ్‌లు. తన ప్రత్యర్థులకు ఆమె ఒక గేమ్‌ను మాత్రమే కోల్పోయింది. ఓవరాల్‌గా 231 పాయింట్లు నెగ్గిన సింధు 191 పాయింట్లు సమర్పించుకుంది. -10 ►తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ముగ్గురు క్రీడాకారిణులను సింధు ఈ టోర్నీలో ఓడించింది. ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో ఉన్న సింధు... లీగ్ దశలో రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై, నంబర్‌వన్ తై జు యింగ్‌పై... ఫైనల్లో ఐదో ర్యాంకర్ ఒకుహారాపై గెలిచింది.-3 ►ఈ విజయం కంటే ముందు సింధు వరుసగా ఏడు ఫైనల్స్‌లో (2017లో హాంకాంగ్ ఓపెన్, సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ, 2018లో ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్‌లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్) ఓడిపోయింది. -7 -
సింధు శుభారంభం
అగ్వాంగ్‌జౌ (చైనా): సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు తొలి అడుగు విజయవంతంగా వేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచితో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో సింధు 24–22, 21–15తో విజయం సాధించి శుభారంభం చేసింది. ఓవరాల్‌గా యామగుచిపై సింధుకిది పదో విజయం కావడం విశేషం. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు కీలకదశలో పైచేయి సాధించి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 27 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 6–11తో వెనుకంజలో ఉంది. అయితే యామగుచి ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న ఈ హైదరాబాద్ అమ్మాయి నెమ్మదిగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ కళ్లు చెదిరే స్మాష్ షాట్లతో స్కోరును 19–19తో సమం చేసింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. 23–22 స్కోరు వద్ద యామగుచి కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ నెట్‌కు తగలడంతో తొలి గేమ్ సింధు వశమైంది. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. విరామానికి సింధు 11–10తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయి... మూడు పాయింట్లు గెలిచిన ఆమె 14–11తో ముందంజ వేసింది. ఇదే జోరులో సింధు 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. యామగుచి కొట్టిన మరో షాట్ నెట్‌కు తగలడంతో సింధు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో తై జు యింగ్‌తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సమీర్ 18–21, 6–21తో ఓడిపోయాడు. గురువారం జరిగే మరో మ్యాచ్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సమీర్ ఆడతాడు. -
విశ్వ కిరీటానికి విజయం దూరంలో...
జగజ్జేతగా అవతరించడానికి తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరో అవకాశం లభించింది. వరుసగా రెండో ఏడాది ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది గ్లాస్గో వేదికగా నొజోమి ఒకుహారా (జపాన్)తో 110 నిమిషాల సుదీర్ఘ తుది సమరంలో ఓడిపోయిన సింధు... ఈసారి స్వదేశానికి విశ్వ విజేతగా తిరిగొచ్చేందుకు మరో విజయం దూరంలో ఉంది. గత ఏడాది కాలంలో సింధు ఐదు మెగా ఈవెంట్స్‌లో ఫైనల్లోకి ప్రవేశించి ఐదుసార్లూ తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరో ‘ఫైనల్’ను ఆమె చిరస్మరణీయం చేసుకోవాలని... చైనా గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆశిస్తూ... బెస్టాఫ్ లక్... సింధు! నాన్జింగ్ (చైనా): భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకునేందుకు పీవీ సింధు ఇంకొక్క విజయం దూరంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–16, 24–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో రెండుసార్లు (2014, 2015) విశ్వవిజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ మారిన్ 13–21, 21–16, 21–13తో హీ బింగ్జియావో (చైనా)పై గెలిచింది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–6తో వెనుకంజలో ఉంది. అయితే మారిన్‌తో జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు సింధునే గెలుపొందడం విశేషం. వెనుకబడి... పుంజుకొని గతేడాది దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో... ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్లో యామగుచి చేతిలో ఓడిపోయిన సింధుకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ సింధు తొలుత వెనుకబడి ఆ తర్వాత తేరుకొని విజయం దక్కించుకోవడం ఆమె మెరుగైన ఆటతీరుకు నిదర్శనం. తొలి గేమ్ ఆరంభంలో అనవసర తప్పిదాలతో సింధు వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. కానీ పాయింట్ల ఖాతా తెరిచిన తర్వాత ఆమె ఆటతీరు గాడిలో పడింది. స్కోరు 4–8 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 9–8తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి ధాటికి సింధు మళ్లీ 10–12తో వెనుకబడింది. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి జూలు విదిల్చింది. కళ్లు చెదిరే స్మాష్‌లు... డ్రాప్ షాట్లు సంధించి వరుసగా 8 పాయింట్లు గెలిచి 18–12తో ముందంజ వేసింది. 12–19 నుంచి 20–19 వరకు... ఇక రెండో గేమ్‌లోనూ తొలుత యామగుచినే ఖాతా తెరిచింది. పాయింట్ల కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా ఎక్కువసార్లు యామగుచినే పైచేయి సాధించింది. 6–2తో... 8–7తో... 11–7తో... 16–12తో... ఇలా ఆధిక్యం పెంచుకుంటూ పోయిన యామగుచి 19–12తో గేమ్ సొంతం చేసుకోవడానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఇక్కడే సింధు అద్భుతం చేసింది. నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా 8 పాయింట్లు దక్కిం చుకొని 20–19తో విజయం ముంగిట నిలిచింది. అయితే యామగుచి తర్వాతి పాయింట్‌ను సాధించి స్కోరును 20–20తో సమం చేసింది. స్కోరు 22–21 వద్ద 41 షాట్లతో కూడిన ర్యాలీని యామగుచి గెలిచి మళ్లీ స్కోరును 22–22తో సమం చేసింది. పట్టువదలని సింధు 23–22తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో మరో పాయింట్ చేరడంతోపాటు విజయం కూడా ఖాయమైంది. ఇంకా నా లక్ష్యం పూర్తి కాలేదు. గతే డాదితో పోలిస్తే ఈసారి ఫైనల్లో మెరుగైన ఫలితం వస్తుందని భావిస్తున్నాను. మారిన్‌తో నేడు జరిగే తుది సమరానికి పకడ్బందీగా సమాయత్తం కావాలి. నా ఆటతీరుపై తనకు... తన ఆటతీరుపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఫైనల్లో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. జపాన్ క్రీడాకారిణులు యామగుచి, ఒకుహారా సుదీర్ఘ ర్యాలీలు ఆడతారు. ఈ ఇద్దరితో ఆడే సమయంలో ఏకాగ్రత, సహనం, నిలకడ కోల్పోకూడదు. యామగుచితో రెండో గేమ్‌లో నేను వెనుకబడిన సమయంలో ఎలాంటి ఆందోళన చెందలేదు. చివరి పాయింట్ వరకు పోరాడాలని, పుంజుకోవాలని ప్రయత్నించాను. – పీవీ సింధు -
చైనా ఓపెన్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్!
ఫుజూ: ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. చైనాలోని ఫుజూలో జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ లో జపాన్ క్రీడాకారిణీ అకానే యమాగుచిపై 21-12, 22-20 స్కోర్ తేడాతో విజయం సాధించారు. కేవలం 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ను సైనా ముగించారు. ఈ మ్యాచ్ లో సైనాకు అకానే గట్టిపోటినచ్చింది. అయితే అకానే పై కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ ను గెలుచుకున్నారు.