BWF World Championships 2021: మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌గా యమగుచి | Yamaguchi Clinches Gold At BWF World Championships 2021 | Sakshi
Sakshi News home page

BWF World Championships 2021: మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌గా యమగుచి

Published Sun, Dec 19 2021 7:17 PM | Last Updated on Sun, Dec 19 2021 7:17 PM

Yamaguchi Clinches Gold At BWF World Championships 2021 - Sakshi

హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ 2021 మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్‌ నంబర్‌ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో జరిగిన తుది పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జపాన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యమగుచి పూర్తి ఆధిపత్యం కొనసాగించింది.

మరోవైపు ప్రపంచ రెండో సీడ్‌, థాయ్‌ జోడీ డెచాపోల్‌ పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ ద్వయం ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్‌ జపాన్‌ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది.  
చదవండి: బాబర్‌, రిజ్వాన్‌ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement