ఫైనల్లో రుత్విక, గురుసాయి | Prannoy to meet Gurusaidutt in men's final at Tata Open badminton | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక, గురుసాయి

Published Sun, Dec 14 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

ఫైనల్లో రుత్విక, గురుసాయి

ఫైనల్లో రుత్విక, గురుసాయి

టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
 ముంబై: నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యా డ్మింటన్ ప్లేయర్స్ గద్దె రుత్విక శివాని, గురుసాయిదత్ టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో రుత్విక శివాని 21-19, 21-18తో శైలి రాణే (భారత్)ను బోల్తా కొట్టించగా... పురుషుల సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-11, 21-11తో అక్షిత్ (భారత్)పై గెలిచాడు.
 
  ఆదివారం జరిగే ఫైనల్స్‌లో అరుంధతి  (భారత్)తో రుత్విక శివాని; ప్రణయ్ (భారత్)తో గురు తలపడతారు. ఇతర సెమీఫైనల్స్‌లో అరుంధతి 21-9, 21-15తో టాప్ సీడ్ పీసీ తులసి (భారత్)పై, ప్రణయ్ 21-13, 23-21తో అజయ్ జయరామ్ (భారత్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన జె.మేఘన-కె.మనీషా ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో మేఘన-మనీషా 21-15, 21-15తో ధాన్యా నాయర్-మోహిత (భారత్)లపై గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-18, 21-3తో శ్లోక్ రామచంద్రన్-మేఘన జోడిని ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement