Tata open badminton tournment
-
Tata Open Maharashtra: రామ్‌కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
ఫైనల్లో రుత్విక, గురుసాయి
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యా డ్మింటన్ ప్లేయర్స్ గద్దె రుత్విక శివాని, గురుసాయిదత్ టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో రుత్విక శివాని 21-19, 21-18తో శైలి రాణే (భారత్)ను బోల్తా కొట్టించగా... పురుషుల సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-11, 21-11తో అక్షిత్ (భారత్)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో అరుంధతి (భారత్)తో రుత్విక శివాని; ప్రణయ్ (భారత్)తో గురు తలపడతారు. ఇతర సెమీఫైనల్స్‌లో అరుంధతి 21-9, 21-15తో టాప్ సీడ్ పీసీ తులసి (భారత్)పై, ప్రణయ్ 21-13, 23-21తో అజయ్ జయరామ్ (భారత్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన జె.మేఘన-కె.మనీషా ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో మేఘన-మనీషా 21-15, 21-15తో ధాన్యా నాయర్-మోహిత (భారత్)లపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-18, 21-3తో శ్లోక్ రామచంద్రన్-మేఘన జోడిని ఓడించింది. -
సెమీస్‌లో రుత్విక, గురుసాయిదత్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు రుత్విక శివాని, గురుసాయిదత్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక 21-18, 22-20తో రితూపర్ణ దాస్ (భారత్)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్ నుంచి ‘వాకోవర్’ లభించింది. మరో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 19-21, 15-21తో అజయ్ జయరామ్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన జె.మేఘన-కె.మనీష ద్వయం సెమీఫైనల్‌కు చేరుకోగా... సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జంట క్వార్టర్ ఫైనల్లో ఓడింది.