సెమీస్‌లో రుత్విక, గురుసాయిదత్ | Tata open badminton tournment | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రుత్విక, గురుసాయిదత్

Published Sat, Dec 13 2014 12:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Tata open badminton tournment

టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
 ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు రుత్విక శివాని, గురుసాయిదత్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక 21-18, 22-20తో రితూపర్ణ దాస్ (భారత్)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్ నుంచి ‘వాకోవర్’ లభించింది.

మరో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 19-21, 15-21తో అజయ్ జయరామ్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన జె.మేఘన-కె.మనీష ద్వయం సెమీఫైనల్‌కు చేరుకోగా... సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జంట క్వార్టర్ ఫైనల్లో ఓడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement