పోరాడి ఓడిన హైదరాబాద్ | Nayar and Gohil's five-fors fire Mumbai into semis | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన హైదరాబాద్

Published Tue, Dec 27 2016 11:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పోరాడి ఓడిన హైదరాబాద్ - Sakshi

పోరాడి ఓడిన హైదరాబాద్

రాయ్‌పూర్: ముంబై జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. ముంబై విసిరిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో పరాజయం చెందింది. హైదరాబాద్ ఆటగాళ్లలో అనిరుధ్(84 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 121/7 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఆఖరి వరకూ పోరాటం సాగించింది. అనిరుధ్ జతగా మిలింద్(29) కాస్త ఫర్వాలేనిపించాడు.

 

అయితే మిలింద్ అవుటైన తరువాత అనిరుధ్ కు ఎవరూ సహకారం అందించకపోవడంతో హైదరాబాద్ ఆట 71.0 ఓవర్లలో 201 పరుగుల వద్ద ముగిసింది. ముంబై బౌలర్లలో గోహిల్, నాయర్ తలో ఐదు వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని  శాసించారు. దాంతో ముంబై మరోసారి సెమీస్ చేరగా, హైదరబాద్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ రంజీల్లో 41 సార్లు చాంపియన్  గా నిలిచిన ముంబై మరోసారి అదే ఆట తీరును పునరావృతం చేసి సగర్వగా సెమీస్లోకి అడుగుపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement