హైదరాబాద్ దీటైన జవాబు | barinath, tanmay firm help to hyderabad's strong | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ దీటైన జవాబు

Published Sun, Dec 25 2016 10:36 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ దీటైన జవాబు - Sakshi

హైదరాబాద్ దీటైన జవాబు

తొలి ఇన్నింగ్స్‌లో 167/3  
రాణించిన తన్మయ్, బద్రీనాథ్  
ముంబై 294 ఆలౌట్  
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్  


 
రాయ్‌పూర్: ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు హైదరాబాద్ జట్టుకు చక్కని అవకాశం లభించింది. రెండో రోజు ఆటలో మొదట బౌలర్లు... తర్వాత బ్యాట్స్‌మెన్  రాణించడంతో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 76 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (223 బంతుల్లో 63 బ్యాటింగ్; 7 ఫోర్లు), కెప్టెన్ బద్రీనాథ్ (137 బంతుల్లో 56; ఫోర్లు 9, సిక్స్ 1) అర్ధసెంచరీలు సాధించారు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్‌‌సలో 101.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది.

 మిలింద్‌కు 5 వికెట్లు

 ముంబై తొలి ఇన్నింగ్‌‌సను మరో 11 ఓవర్లలో ముగించడంలో సి.వి.మిలింద్ (5/80), సిరాజ్ (4/64) కీలకపాత్ర పోషించారు. దీంతో 250/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ముంబై మరో 44 పరుగులు మాత్రమే జతచేసి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 264 వద్ద ముందుగా ఓవర్‌నైట్ సెంచరీ హీరో సిద్ధేశ్ లాడ్ (110)ను రవికిరణ్ ఔట్ చేయడంతో ముంబై పతనం ఆరంభమైంది. అనంతరం కాసేపటికే 286 స్కోరువద్ద అభిషేక్ నాయర్ (59)ను మిలింద్ ఔట్ చేస్తే... అదే స్కోరు వద్ద శార్దుల్ ఠాకూర్ (10), అక్షయ్ గిరాప్ (0)లను సిరాజ్ పెవిలియన్ పంపాడు. చివరకు తుషార్‌ను మిలింద్ ఔట్ చేసి ముంబై ఇన్నింగ్‌‌సను ముగించాడు.

 తన్మయ్ అజేయ అర్ధసెంచరీ

 అనంతరం తన్మయ్‌తో కలసి హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభించిన అక్షత్ రెడ్డి (13) విఫలమయ్యాడు. జట్టు స్కోరు 26 పరుగుల వద్ద అభిషేక్ నాయర్ బౌలింగ్‌లో అతను నిష్క్రమించాడు. కాసేపటికే అనిరుధ్ (4)ను కూడా నాయరే ఔట్ చేయడంతో  హైదరాబాద్ 30 పరుగుల వద్ద రెండు వికెట్లను కోల్పోరుుంది. ఈ దశలో కెప్టెన్ బద్రీనాథ్‌తో కలసి తన్మయ్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఇద్దరు కుదురుగా ఆడి ముంబై బౌలర్లకు విసుగుతెప్పించారు. ఈ క్రమంలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించాక బద్రీనాథ్‌ను కూడా నాయరే ఔట్ చేయడంతో మూడో వికెట్ నేలకొరిగింది. అనంతరం వచ్చిన సందీప్ (10 బ్యాటింగ్) ప్రత్యర్థి బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా నాటౌట్‌గా నిలిచాడు.

 స్కోరు వివరాలు

 ముంబై తొలి ఇన్నింగ్స్: కెవిన్ (సి) సుమంత్ (బి) మిలింద్ 9; వాఘేలా (బి) మిలింద్ 13; శ్రేయస్ (సి) అక్షత్ రెడ్డి (బి) మిలింద్ 0; సూర్యకుమార్ (సి) సుమంత్ (బి) సిరాజ్ 5; ఆదిత్య తారే (సి) బద్రీనాథ్ (బి) సిరాజ్ 73; సిద్ధేశ్ (సి) సుమంత్ (బి) రవికిరణ్ 110; అభిషేక్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ బి) మిలింద్ 59; శార్దుల్ (సి అండ్ బి) సిరాజ్ 10; గిరాప్ (బి) సిరాజ్ 0; తుషార్ దేశ్‌పాండే (సి) సుమంత్ (బి) మిలింద్ 4; విజయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (101.4 ఓవర్లలో ఆలౌట్) 294.

 వికెట్ల పతనం: 1-12, 2-12, 3-19, 4-34, 5-139, 6-264, 7-286, 8-286, 9-286, 10-294

 బౌలింగ్: రవికిరణ్ 20-6-62-1, మిలింద్ 23.4-6-80-5, సిరాజ్ 21-6-64-4, హసన్ 20-10-35-0, భండారి 17-4-47-0.
 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ బ్యాటింగ్ 63; అక్షత్ రెడ్డి (సి) తారే (బి) అభిషేక్ నాయర్ 13; అనిరుధ్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ నాయర్ 4; బద్రీనాథ్ (బి) అభిషేక్ నాయర్ 56; సందీప్ బ్యాటింగ్ 10; ఎక్స్‌ట్రాలు 21, మొత్తం (76 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 167.

 వికెట్ల పతనం: 1-26, 2-30, 3-135

 బౌలింగ్: శార్దుల్ 15-6-28-0, తుషార్ 12-1-41-0; అభిషేక్ నాయర్ 17-7-26-3, విజయ్ 13-2-41-0, అక్షయ్ 16-10-10-0, సూర్యకుమార్ 2-0-10-0, కెవిన్ 1-1-0-0.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement