హైదరాబాద్ 280 ఆలౌట్
ముంబై రెండో ఇన్నింగ్స్ లో 102/3
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్
రాయ్‌పూర్: ముంబైలాంటి పటిష్ట జట్టుతో అందివచ్చిన అవకాశాన్ని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వదులుకున్నారు. తొలి ఇన్నింగ్‌స ఆధిక్యాన్ని చేజార్చుకున్నారు. మూడో రోజు ఆటలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌సలో 125.1 ఓవర్లలో 280 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ముంబైకి 14 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్‌స ఆడిన ముంబై ఆట నిలిచే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై 116 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్నారుు. రెండు రోజుల ఆట మిగిలుంది.
బ్యాట్స్‌మెన్ వైఫల్యం
రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 167/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉంది. కానీ ఆదివారం ఆటలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 113 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న తన్మయ్ అగర్వాల్ (284 బంతుల్లో 82; 9 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 19 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. బావనక సందీప్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా, కొల్లా సుమంత్ (109 బంతుల్లో 44; 5 ఫోర్లు), మెహదీ హసన్ (62 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. దీంతో జట్టు స్కోరు 255 పరుగులకు చేరింది. ఇక ఆధిక్యం దిశగా పయనిస్తుందనుకున్న తరుణంలో విజయ్ గోహిల్ (3/59) స్వల్ప వ్యవధిలో మెహదీ హసన్, ఆకాశ్ భండారి (0), సిరాజ్ (0)లను ఔట్ చేసి చావుదెబ్బ తీశాడు. అభిషేక్ నాయర్‌కు 4, శార్దుల్ ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఆదుకున్న తారే
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై ఆరంభంలో సిరాజ్ (2/36) ధాటికి తడబడింది. మొదట ఓపెనర్ కెవిన్ అల్మెడా (1)ను మిలింద్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో జట్టు స్కోరు 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోరుుంది. తర్వాత కాసేపటికి శ్రేయస్ అయ్యర్ (12), సూర్యకుమార్ యాదవ్ (3)లను సిరాజ్ పెవిలియన్ పంపాడు. దీంతో 52 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారే (47 బంతుల్లో 39 బ్యాటింగ్; 8 ఫోర్లు), ప్రఫుల్ వాఘేలా (88 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలసి కుదురుగా ఆడారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
స్కోరు వివరాలు
ముంబై తొలి ఇన్నింగ్స్ 294; హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌స: తన్మయ్ (సి) వాఘేలా (బి) శార్దుల్ 82; అక్షత్ రెడ్డి (సి) తారే (బి) అభిషేక్ నాయర్ 13; అనిరుధ్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ నాయర్ 4; బద్రీనాథ్ (బి) అభిషేక్ నాయర్ 56; సందీప్ (సి) తారే (బి) నాయర్ 17; కొల్లా సుమంత్ (సి) తారే (బి) శార్దుల్ 44; మెహదీ హసన్ (సి అండ్ బి) విజయ్ 32; భండారి (సి) తారే (బి) విజయ్ 0; మిలింద్ (సి) వాఘేలా (బి) అక్షయ్ 6; సిరాజ్ (సి) వాఘేలా (బి) విజయ్ 0; రవికిరణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (125.1 ఓవర్లలో ఆలౌట్) 280.
వికెట్ల పతనం: 1-26, 2-30, 3-135, 4-191, 5-197, 6-255, 7-255, 8-265, 9-266, 10-280
బౌలింగ్: శార్దుల్ 25.1-11-45-2, తుషార్ 23-5-73-0, అభిషేక్ నాయర్ 29-9-60-4, విజయ్ 23-3-59-3, అక్షయ్ 22-12-20-1, సూర్యకుమార్ 2-0-10-0, కెవిన్ 1-1-0-0.
ముంబై రెండో ఇన్నింగ్‌స: కెవిన్ (బి) మిలింద్ 1; వాఘేలా బ్యాటింగ్ 27; శ్రేయస్ (బి) సిరాజ్ 12; సూర్యకుమార్ (బి) సిరాజ్ 3; ఆదిత్య తారే బ్యాటింగ్ 39; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (35 ఓవర్లలో 3 వికెట్లకు) 102.
వికెట్ల పతనం: 1-14, 2-32, 3-52
బౌలింగ్: రవికిరణ్ 11-4-28-0, మిలింద్ 7-2-9-1, మెహదీ హసన్ 8-3-5-0, సిరాజ్ 6-1-36-2.