గురుసాయిదత్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఏడాది విరామం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గురుసాయిదత్ ఆఖరి అడ్డంకిని అధిగమించలేకపోయాడు. బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ గురుసాయిదత్ 17-21, 21-16, 19-21తో ప్రపంచ 46వ ర్యాంకర్ పాబ్లో అబియాన్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో సుమీత్-మనూ ద్వయం 14- 21, 16-21తో రాఫెల్ బెక్-పీటర్ కాస్బూర్ (జర్మనీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.